లేఖన కథలు
ఆల్మా మరియు కొరిహోర్


“ఆల్మా మరియు కొరిహోర్,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

ఆల్మా 30

ఆల్మా మరియు కొరిహోర్

దేవుడు నిజమైనవాడని విశ్వాసం

కొరిహోర్‌ రద్దీగా ఉండే దారిలో ఎవరో ఒకరితో కలిసి నడుస్తూ మరియు నవ్వుతూ మాట్లాడుతాడు

కొరిహోర్‌ అనే వ్యక్తి జరహేమ్ల దేశానికి వచ్చాడు. దేవుడు మరియు యేసు క్రీస్తు నిజమైనవారు కాదని ప్రజలకు చెప్పాడు.

ఆల్మా 30:6, 12, 37–38, 45

కొరిహోర్‌ విచారంగా ఉన్న పిల్లవాడిని చూసి నవ్వుతూ సైగలు చేస్తాడు

ప్రజలు దేనినైనాచూస్తేనే దానిని తెలుసుకోగలరని కొరిహోర్‌ చెప్పాడు. అతడు యేసును విశ్వసించే ప్రజలను ఎగతాళి చేశాడు.

ఆల్మా 30:13–16

కొరిహోర్‌ ప్రజల గుంపుతో నవ్వుతూ మాట్లాడుతాడు

ప్రజలకు దేవుని ఆజ్ఞలు అవసరం లేదని కొరిహోర్‌ చెప్పాడు. ప్రజలు కోరుకున్నది ఏదైనా చేయగలరని అతడు చెప్పాడు. చాలా మంది అతనిని నమ్మారు. వారు చెడు పనులు చేయాలని నిర్ణయించుకున్నారు.

ఆల్మా 30:17–18

కొరిహోర్‌ బంధింపబడి, సైనికుల ద్వారా గ్రామం నుండి బయటకు పంపబడ్డాడు.

కొరిహోర్‌ ఆంటై-నీఫై-లీహైయుల‌కు బోధించడానికి ప్రయత్నించాడు, కానీ వారు అతనిని నమ్మలేదు. వారు అతడిని కట్టివేసి పంపివేసారు. అతను బదులుగా గిద్యోను దేశానికి వెళ్ళాడు. అక్కడున్నవాళ్లు కూడా అతడిని కట్టేశారు. వారు అతన్ని ఆల్మా వద్దకు పంపారు.

ఆల్మా 30:19–29

కొరిహోర్‌ అల్మా వైపు నవ్వుతూ సైగలు చేస్తాడు

దేవుడు నిజము కాదని కొరిహోర్‌ ఆల్మా కు చెప్పాడు. ఆల్మా మరియు ఇతర యాజకులు ప్రజలతో అబద్ధమాడుతున్నారని అతడు చెప్పాడు. ప్రజలను మూర్ఖ సంప్రదాయాలు పాటించేలా వారు చేస్తున్నారన్నారని కొరిహోర్‌ చెప్పాడు. వారు ప్రజల నుంచి డబ్బులు కూడా తీసుకుంటున్నారని అతడు చెప్పాడు. ఇది నిజం కాదని ఆల్మాకు తెలుసు. అతను దేవునిని మరియు యేసును విశ్వసించాడు.

ఆల్మా 30:30–40

చేతులు కట్టుకొని కొరిహోర్ వెనుకవైపు కూర్చున్నప్పుడు అల్మా ప్రజల గుంపుతో మాట్లాడాడు.

దేవుడు నిజమని తెలుసుకోవడానికి ప్రవక్తలు మరియు భూమిపై ఉన్న సమస్తము ప్రజలకు సహాయపడుతుందని ఆల్మా చెప్పాడు. కొరిహోర్ మరింత రుజువును కోరాడు. కొరిహోర్‌కు రుజువు చూపిస్తానని ఆల్మా చెప్పాడు. దేవుడు కొరిహోర్‌ను మాట్లాడనీయకుండా చేస్తాడని అతడు చెప్పాడు. ఆల్మా ఇలా చెప్పిన వెంటనే, కొరిహోర్ మాట్లాడలేకపోయాడు.

ఆల్మా 30:41–50

జనుల గుంపు అతడి నుండి దూరంగా వెళుతుండగా, కొరిహోర్ విచారంగా చూస్తూ ఒక కాగితం ముక్కపై వ్రాసిన దానివైపు చూపిస్తాడు

దేవుడు నిజమని తనకు తెలుసునని కొరిహోర్ వ్రాశాడు. అతనికి ఎల్లప్పుడ తెలుసు. సాతాను తనను మోసం చేసిందని అతడు వ్రాశాడు. దేవుడు మరియు యేసు గురించి అబద్ధాలు బోధించమని సాతాను కొరిహోర్‌కు చెప్పాడు. ప్రజలు కొరిహోర్‌ గురించి నిజం తెలుసుకున్నప్పుడు, వారు అతని బోధనలను నమ్మలేదు. వారు పశ్చాత్తాపపడి మళ్లీ యేసును అనుసరించడం మొదలుపెట్టారు.

ఆల్మా 30:52–53, 57–58