“యేసు పుట్టుక గురించి సూచనలు,” మోర్మన్ గ్రంథ కథలు (2023)
యేసు పుట్టుక గురించి సూచనలు
ప్రవక్త బోధనలపై విశ్వాసం
అప్పటికి సమూయేలు ప్రవక్త యేసు క్రీస్తు పుట్టుక యొక్క సూచనల గురించి బోధించి దాదాపు ఐదు సంవత్సరాలైంది. చాలా మంది ప్రజలు నమ్మారు మరియు సూచనల కోసం చూశారు. ఇతర వ్యక్తులు సమూయేలు తప్పని మరియు సూచనల కోసం సమయం ఇప్పటికే గడిచిపోయింది అని చెప్పారు. వారు విశ్వాసులను ఎగతాళి చేశారు మరియు యేసు రాడు అని చెప్పారు.
విశ్వాసులు ఆందోళన చెందారు, కానీ వారు విశ్వాసము కలిగియున్నారు. వారు సూచనల కోసం చూస్తూనే ఉన్నారు. ఒక సూచన చీకటి పడని రాత్రి. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా అది పగటిపూటలా ప్రకాశవంతంగా ఉంటుంది. చీకటి లేని రాత్రి యేసు మరుసటి రోజు వేరొక దేశంలో జన్మిస్తాడనడానికి సూచనగా ఉంటుంది.
నమ్మని ప్రజలు ఒక ప్రణాళిక చేశారు. వారు ఒక రోజును ఎంచుకుని, ఆ రోజులోగా సూచన జరగకపోతే, విశ్వాసులకు మరణశిక్ష విధించబడుతుందని చెప్పారు.
ఆ సమయంలో నీఫై అనే వ్యక్తి ప్రవక్తగా ఉన్నాడు. విశ్వాసులను చంపాలని కొందరు చూస్తున్నారని తెలిసి ఆయన చాలా బాధపడ్డాడు.
నీఫై నేలపై వంగి, తమ విశ్వాసం కారణంగా చనిపోబోతున్న విశ్వాసుల కోసం దేవునికి ప్రార్థించాడు. అతడు రోజంతా ప్రార్థించాడు.
తన ప్రార్థనకు సమాధానంగా, నీఫై యేసు స్వరాన్ని విన్నాడు. ఆ రాత్రే ఆ సూచన జరుగుతుందని, ఆ తర్వాత మరుసటి రోజు తాను పుడతానని యేసు చెప్పారు.
ఆ రాత్రి సూర్యుడు అస్తమించినా చీకటి లేదు. సమూయేలు మాటలు నమ్మని ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు, వారు నేలమీద పడిపోయారు. వారు నమ్మలేదు కాబట్టి భయపడ్డారు. నమ్మిన ప్రజలకు మరణశిక్ష విధించబడలేదు.
మరుసటి రోజు,సూర్యుడు మళ్లీ ఉదయించాడు మరియు ఆకాశం ప్రకాశవంతంగా ఉంది. యేసు పుట్టబోయే రోజు ఇదేనని ప్రజలందరికీ తెలిసింది.
ప్రజలు మరొక గుర్తును చూశారు. ఆకాశంలో కొత్త నక్షత్రం కనిపించింది. సమూయేలు చెప్పిన సూచనలన్నీ నిజమయ్యాయి. ఇంకా చాలా మంది ప్రజలు యేసును నమ్మి బాప్తిస్మము తీసుకున్నారు.