“ప్రవక్తయైన నీఫై,” మోర్మన్ గ్రంథ కథలు (2023)
ప్రవక్తయైన నీఫై
ప్రభువు నుండి గొప్ప శక్తిని పొందుట
గాడియాంటన్ దొంగలని పిలవబడిన ఒక గుంపు జారహేమ్ల పట్టణాన్ని పరిపాలించారు. వారు చెడు పనులు చేయడానికి ఒకరికొకరు సహాయపడాలని వారు ప్రమాణం చేసారు. డబ్బు, అధికారం పొందడానికి వారు దొంగిలించారు మరియు జనులను గాయపరిచారు. అనేకమంది జనులు దొంగలతో చేరారు. వారు ధనికులు కావాలనుకున్నారు.
నీఫై ప్రవక్త జరహేమ్లాలో నివిసించాడు. జనులు దేవుని ఆజ్ఞలను పాటించుట లేదని అతడు విచారంగా ఉన్నాడు కనుక నీఫై దేవునికి ప్రార్థించాడు. దేవుడు వారి కోసం చేసినదంతా గుర్తుంచుకోమని నీఫై జనులను అడిగాడు. కానీ అనేకమంది జనులు వినలేదు. దేవునికి విధేయత చూపడం కంటే వారు డబ్బు, అధికారము గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు.
దొంగలు గురించి జనులను నీఫై హెచ్చరించాడు. వారు పశ్చాత్తాపపడాలని అతడు చెప్పాడు. నీఫైయుల న్యాయాధికారులలో కొందరు దొంగలతో చేరారు. వారు నీఫైపై కోపగించారు మరియు అతడు అబద్ధమాడుతున్నాడని అన్నారు. జనులు కూడ నీఫైమీద కోపగించాలని వారు కోరారు.
దేవుడు తన ప్రవక్తలకు అనేక విషయాలను చెప్తాడని నీఫై చెప్పాడు. యేసు క్రీస్తు రాకడ గురించి ప్రవక్తలందరు బోధించారని నీఫై వారితో చెప్పాడు. వారు పశ్చాత్తాపపడని యెడల, యెరూషలేము నాశనం చేయబడుతుందని ప్రవక్తలు జనులను హెచ్చరించారని అతడు చెప్పాడు. యెరూషలేము నాశనము చేయబడిందని గుర్తుంచుకోవడానికి అతడు వారికి సహాయపడ్డాడు.
మరుసటి రోజు, న్యాయాధికారులు నీఫైను మోసగించడానికి అతడిని ప్రశ్నలు అడిగారు. వారి మధ్య చెడు గురించి అతడు వారితో చెప్పాడు. కొందరు నీఫైను నమ్మారు మరియు అతడు ఒక ప్రవక్త అని తెలుసుకున్నారు.
మిగిలిన వారు నమ్మలేదు. ప్రతిఒక్కరు వాదించారు, తరువాత వెళ్ళిపోయారు. ప్రభువు తనకు బోధించిన దాని గురించి నీఫై ఆలోచించాడు. జనుల చెడు క్రియల వలన అతను విచారించాడు.
ప్రభువు నీఫైతో మాట్లాడతాడు. నీఫై జనులకు బోధించాడని ఆయన సంతోషించారు. నీఫై ఎంతో విధేయుత చూపించుట వలన, ప్రభువు అతనికి భూమీ మీద, పరలోకంలోని విషయాలపై ప్రత్యేక అధికారాన్ని ఇచ్చారు. నీఫై తన జనులు పశ్చాత్తాపపడటానికి మాత్రమే అధికారాన్ని ఉపయోగిస్తాడని ప్రభువుకు తెలుసు.
జనుల వద్దకు తిరిగి వెళ్ళమని, పశ్చాత్తాపపడమని వారికి చెప్పమని ప్రభువు నీఫైతో చెప్పాడు. నీఫై వెంటనే వెళ్లాడు. కాని జనులు అతనితో కోపంగా ఉన్నారు, మరియు వినలేదు.
వారు నీఫైను చెరసాలలో పెట్టడానికి ప్రయత్నించారు. కానీ దేవుని ఆత్మ నీఫై తప్పించుకోవడానికి సహాయపడింది.
నీఫై దేవుని వాక్యాన్ని బోధించడం కొనసాగిస్తాడు. అయినను జనులు అతడి మాటలు వినలేదు. వారు వాదించడం మొదలుపెట్టి, ఒకరితో ఒకరు పోరాడతారు. దొంగలు పోరాటాన్ని ఎక్కువ చేసారు. త్వరలో, ప్రతి పట్టణంలో యుద్ధాలున్నాయి. అనేకమంది జనులు గాయపడ్డారు లేదా చంపబడ్డారు. నీఫై విచారించాడు. జనులు యుద్ధాల చేత నాశనం చేయబడాలని అతడు కోరలేదు.
జనులు ప్రభువును గుర్తుంచుకుని, పశ్చాత్తాపడునట్లు గొప్ప కరువు కలిగించమని నీఫై దేవుడిని అడిగాడు. అనేక సంవత్సరాలు వర్షం కురువలేదు. భూమి ఎండిపోయింది, పంటలు పండలేదు. జనులు ఆకలిగా ఉన్నారు. వారు పోరాడటం మానేశారు మరియు ప్రభువును గుర్తుంచుకోవడం ప్రారంభించారు. జనులు పశ్చాత్తాపపడ్డారు మరియు దొంగలను వదిలించుకున్నారు.
ప్రభువుకు ప్రార్థించమని జనులు నీఫైను అడుగుతారు. వారు పశ్చాత్తాపపడ్డారని, దొంగలు పోయారని నీఫై చూస్తాడు. వర్షమును పంపమని ప్రభువును అతడు అడుగుతాడు. ప్రభువు నీఫై యొక్క ప్రార్థనకు జవాబిస్తాడు. వర్షం వస్తుంది, మరియు పంటలు పెరగడం ప్రారంభిస్తాయి. జనులు దేవునికి కృతజ్ఞత తెలుపుతారు. నీఫై ఒక ప్రవక్త అని, దేవుని నుండి గొప్ప అధికారాన్ని కలిగియున్నాడని వారికి తెలుసు.