“ప్రవక్తయైన మోర్మన్,” మోర్మన్ గ్రంథ కథలు (2023)
మోర్మన్ వాక్యములు 1; మోర్మన్ 1–8
ప్రవక్తయైన మోర్మన్
మోర్మన్ గ్రంథమును వ్రాయుట
మోర్మన్ ఒక నీఫైయుడు, అతడు యేసునందు విశ్వసించాడు. అనేకమంది జనులు దేవుని ఆజ్ఞలను పాటించని సమయంలో అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. డబ్బు, అధికారం కోసం వారు ఒకరినొకరు దోచుకున్నారు మరియు చంపుకున్నారు. అక్కడ అనేక యుద్ధాలున్నాయి.
3 నీఫై 5:12–13; 4 నీఫై 1:27–49; మోర్మన్ 1:1–3, 15, 18–19
మోర్మన్ 10 సంవత్సరాలప్పుడు, అమ్మరోన్ అనే పేరుగల వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. అమ్మరోన్ నీఫైయుల చరిత్ర యొక్క నివేదికలను గూర్చి శ్రద్ధ తీసుకున్నాడు. అమ్మరోన్ మోర్మన్‌ను నమ్మాడు మరియు నివేదికలు ఒక కొండపై దాచబడ్డాయని అతనికి చెప్పాడు. మోర్మన్ 24 సంవత్సరాలప్పుడు, తమ జనులు గురించి తాను చూసిన దానిని వ్రాయమని, దానిని నివేదికలకు చేర్చమని అమ్మరోన్ చెప్పాడు.
మోర్మన్ ఎదుగుచుండగా, అమ్మరోన్ తనను చేయమని అడిగిన దానిని అతడు గుర్తు చేసుకున్నాడు. మోర్మన్‌కు 15 సంవత్సరాలప్పుడు, అతడు ప్రభువు చేత దర్శించబడ్డాడు. యేసు యొక్క మంచితనము గురించి మోర్మన్ నేర్చుకున్నాడు.
మోర్మన్ చిన్నగా ఉన్నప్పటికినీ, అతడు బలంగా ఉన్నాడు. నీఫైయులు వారి సైన్యాలను నడిపించడానికి అతడిని ఎన్నుకున్నారు. మోర్మన్ తన పూర్ణ హృదయముతో జనులను ప్రేమించాడు. వారు దేవునికి లోబడాలని, సంతోషంగా ఉండాలని అతడు కోరాడు
మోర్మన్ 2:1–2, 12, 15, 19; 3:12
జనులకు సహాయపడటానికి మోర్మన్ ప్రయత్నించాడు. అతడు వారి కొరకు దినదినము ప్రార్థించాడు. తాము చెడు విషయాలు చేస్తున్నారని జనులకు తెలుసు, కానీ వారు పశ్చాత్తాపపడలేదు. వారికి ఇక సహాయపడటానికి దేవుని యొక్క శక్తిని వారు కలిగిలేరు. వారికి విశ్వాసము లేనందు వలన, అద్భుతాలు ఆగిపోయాయి. వారు పోరాడటం కొనసాగించారు, మరియు వారిలో అనేకమంది చనిపోయారు. మోర్మన్ విచారంగా ఉన్నాడు.
మోర్మన్ 1:13–14, 16–19; 2:23–27; 3:1–12; 4:5, 9–12; 5:1–7
మోర్మన్‌కు 24 సంవత్సరాలప్పుడు, అతడు నివేదికలు దాచబడిన కొండ వద్దకు వెళ్ళాడు. అతడు జనుల కథలను, బోధనలను లోహపు పలకలపై వ్రాయడం ప్రారంభించాడు. అతడు వ్రాయాల్సిన దానిని తెలుసుకోవడానికి దేవుడు అతనికి సహాయపడ్డాడు. మోర్మన్ అనేక సంవత్సరాలు నివేదికపై పనిచేసాడు. ఈరోజు, ఆ నివేదిక మోర్మన్ గ్రంథమని పిలవబడింది.
మోర్మన్ వాక్యములు 1:3–9; మోర్మన్ 1:3–4; 2:17–18
అనేక యుద్ధాల తరువాత, లేమనీయులు దాదాపు నీఫైయులందరిని చంపివేసారు. తన జనులు త్వరలో గతించిపోతారని మోర్మన్‌కు తెలుసు. వారు పశ్చాత్తాపపడలేదు, మరియు సహాయం కోసం దేవునిని అడగలేనందు వలన అతడు విచారించాడు. కానీ అతడు ప్రార్థన చేసి, పలకలను కాపాడమని దేవుడిని అడిగాడు. దేవుని మాటలు వాటిపై ఉన్నాయి కనుక, పలకలు భద్రంగా ఉంటాయని అతనికి తెలుసు.
మోర్మన్ వాక్యములు 1:11; మోర్మన్ 5:11; 6:6, 16–22
జనులు యేసునందు నమ్మకముంచాలని మొరోనై కోరాడు. భవిష్యత్తులో అనేకమంది జనులు గ్రంథాన్ని చదువుతారని అతడు ఆశించాడు. ప్రత్యేకంగా, లేమనీయ కుటుంబాలు ఒకరోజు దానిని చదవాలని అతడు కోరాడు. వారు చదివితే, వారు యేసు గురించి నేర్చుకుంటారు. మోర్మన్ చనిపోకముందు, అతడు తన కుమారుడైన మొరోనైకు నివేదికను ఇచ్చాడు ఆవిధంగా అది భద్రంగా ఉంటుంది.
మోర్మన్ వాక్యములు 1:1–2; మోర్మన్ 3:17–22; 5:8–24; 6:6; 7; 8:1