Scripture Stories
రాజైన నోవహు మరియు రాజైన లింహై


“రాజైన నోవహు మరియు రాజైన లింహై,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

మోషైయ 19–22

రాజైన నోవహు మరియు రాజైన లింహై

లేమనీయుల నుండి పారిపోవడం

చిత్రం
గిడియన్‌ ఒక ఖడ్గమును పట్టుకుని గోపురమువద్ద నిలబడియుండెను, నోవహు గోపురములో ఉండి లేమనీయుల సైన్యము వైపు సూచిస్తున్నాడు.

రాజైన నోవహు ఒక నీఫైయుల సమూహాన్ని పరిపాలించాడు. అతడు చాలా దుష్కార్యములు చేశాడు, మరియు కొంతమంది అతనిపై కోపంగా ఉన్నారు. గిడియన్‌ అను పేరుగల మనుష్యుడు తన ఖడ్గమును దూసి నోవహుతో పోరాడెను. నోవహు పరుగెత్తి పారిపోయి గోపురముపైకి చేరెను. గోపురము నుండి, అతడు లేమనీయుల సైన్యం రావడం చూశాడు. నోవహు తన జనుల కోసం భయపడుతున్నట్లు నటించాడు, కాబట్టి గిడియాన్ అతడిని బ్రతుకనిచ్చెను.

మోషైయ 11:1–2; 19:2–8

చిత్రం
నోవహు పరుగెత్తి పారిపోయెను, మరియు నోవహు యొక్క జనులు భయపడిరి

నోవహు మరియు అతని జనులు పరుగెత్తి పారిపోయిరి. అయితే లేమనీయులు వారిని తరుముచూ, సంహరించుట మొదలుపెట్టిరి. పురుషులందరు తమ కుటుంబాలను వదిలి విడిచిపెట్టి తనతో వెళ్లవలెనని నోవహు వారితో చెప్పాడు.

మోషైయ 19:9–11

చిత్రం
లింహై, గిడియన్‌, మరియు ఇతర నీఫైయులు లేమనీయుల సైన్యమును ఎదుర్కొన్నారు

కొంతమంది పురుషులు నోవహుతో పాటు వెళ్లిపోయారు కానీ అనేకమంది పురుషులు వారి కుటుంబాలతోపాటు నిలిచి ఉండటానికి ఎంచుకున్నారు. నోవహు కుమారుడు లింహై కూడా నిలిచి ఉండటానికి ఎంచుకున్నాడు.

మోషైయ 19:12, 16–17

చిత్రం
స్త్రీలు లింహై మరియు ఇతర నీఫైయులు ముందు నిలబడ్డారు

చాలా మంది కుమార్తెలు సైన్యం ముందు నిలబడి, తమ కుటుంబాలను బాధపెట్టవద్దని గాయపరచ వద్దని లేమనీయులను బ్రతిమాలుకొన్నారు లేమనీయులు ఆ కుమార్తెల మాట విని నీఫైయులను బ్రతకనిచ్చారు. బదులుగా, లేమనీయులు నీఫైయులను బందీలుగా చేసుకున్నారు.

మోషైయ 19:13–15

చిత్రం
నోవహు మరియు అతనితోనున్న పురుషులందరు ఒకరిపై ఒకరు కోపంగా ఉన్నారు.

పారిపోయిన పురుషులందరు తమ కుటుంబాలకు తిరిగి వెళ్లాలని కోరుకున్నారు. నోవహు వారిని ఆపడానికి ప్రయత్నించాడు, కాబట్టి పురుషులు అతడు మరణించునట్లు చేసిరి. ఆ తర్వాత వారు తమ కుటుంబాల వద్దకు తిరిగి వెళ్లారు.

మోషైయ 19:18–22

చిత్రం
నీఫై పురుషులు వారి కుటుంబాలను మరియు గిద్యోనును అభినందించారు

తమ కుటుంబాలు సురక్షితంగా ఉన్నాయని పురుషులు చాలా సంతోషించారు. నోవహుకు జరిగిన దానిని వారు గిద్యోనుకు చెప్పారు.

మోషైయ 19:22–24

చిత్రం
లింహై లేమనీయులకు ఆహారం మరియు జంతువులను అందజేసేవాడు

జనులు లింహైని తమ కొత్త రాజుగా ఎన్నుకున్నారు. లేమనీయులకు తమకు కలిగిన సమస్త ఆస్తిలో సగభాగము చెల్లిస్తానని లింహై లేమనీయుల రాజుకు ప్రమాణము చేశాడు. బదులుగా, లేమనీయుల రాజు తాను లింహై జనులను సంహరించనని వాగ్దానం చేశాడు.

మోషైయ 19:25–27

చిత్రం
లింహై మరియు అతని భార్య విచారంగా కనబడుతున్నారు, మరియు చాలా మంది నీఫైయులు గాయపడ్డారు

వారు చాలా సంవత్సరాలు ప్రశాంతంగా జీవించారు. తరువాత లేమనీయుల లింహై జనులతో చెడుగా ప్రవర్తించడం ప్రారంభించారు. జనులు మళ్లీ స్వేచ్చ కావాలని కోరుకున్నారు. వారు లేమనీయులతో పోరాడటానికి ప్రయత్నించారు, కానీ వారు ఓడిపోయారు. జనులు సహాయం కోసం దేవుడిని ప్రార్థించారు.

మోషైయ 19:29; 21:1–15

చిత్రం
లింహై మరియు అమ్మోన్‌లు మాట్లాడుకుంటున్నారు.

ఒకరోజు, అమ్మోన్ అనే ఒక నీఫైయుడు లింహై మరియు అతని జనులను సందర్శించాడు. అమ్మోన్ జరహేమ్ల అనే పేరుగల దేశము నుండి వచ్చియున్నాడు లింహై అమ్మోన్‌ను చూసి సంతోషించాడు.

మోషైయ 21:22–24

చిత్రం
గిడియన్‌, లింహై అమ్మోన్‌, మరియు ఇతర నీఫైయులు మాట్లాడుకుంటున్నారు

అమ్మోన్ లింహై జనులను జరహేమ్లాకు నడిపించగలడు, కాని వారు మొదట లేమనీయుల నుండి తప్పించుకోవలసివుంది. గిడియన్‌ ఒక ప్రణాళిక కలిగియున్నాడు.

మోషైయ 21:36; 22:1–9, 11

చిత్రం
లేమనీయుల కాపలాదారులు నిద్రించారు, మరియు నీఫైయులు నగరం విడిచిపెట్టారు

రాత్రి సమయంలో, గిడియన్‌ లేమనీయుల కాపలాదారులు నిద్రపోయేలా చేయడానికి వారికి అదనపు ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. కాపలాదారులు నిద్రిస్తున్నప్పుడు, లింహై మరియు అతని జనులందరూ నగరం నుండి తప్పించుకున్నారు.

మోషైయ 22:7, 10–12

చిత్రం
రాజైన మోషైయ మరియు అతని జనులు లింహై మరియు అతని జనులను స్వాగతించారు.

వారు జరహేమ్లకు వెళ్లి అక్కడ ఉన్న నీఫైయులతో చేరారు. లింహై మరియు అతని జనులు దేవుని గురించి మరింతగా తెలుసుకున్నారు. వారు దేవుని సేవించడానికి మరియు ఆయన ఆజ్ఞలను పాటించుటకు ఒక నిబంధన లేదా ప్రత్యేక వాగ్దానం చేసారు. వారు బాప్తిస్మము తీసుకున్నారు మరియు దేవుని సంఘములో భాగమయ్యారు. లేమనీయుల నుండి తప్పించుకోవడానికి దేవుడు తమకు సహాయం చేశాడని వారు గుర్తు చేసుకున్నారు.

మోషైయ 21:32–35; 22:13–14; 25:16–18

ముద్రించు