Scripture Stories
చెరసాలలో ఆల్మా మరియు అమ్యులెక్


“చెరసాలలో ఆల్మా మరియు అమ్యులెక్,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

ఆల్మా 14

చెరసాలలో ఆల్మా మరియు అమ్యులెక్

కష్ట సమయాల్లో ప్రభువునందు విశ్వాసముంచుట

చిత్రం
కాపలాదారులతో ఆల్మా మరియు అమ్యులెక్

ఆల్మా మరియు అమ్యులెక్ అమ్మోనైహా దేశములో సువార్త బోధించారు. కొందరు ప్రభువును విశ్వసించి పశ్చాత్తాపపడ్డారు. కానీ చాలా మంది ప్రజలు ఆల్మా మరియు అమ్యులెక్ పై కోపముగానుండిరి మరియు వారిని నాశనం చేయాలని కోరుకున్నారు. కోపోద్రిక్తులైన ప్రజలు ఆల్మా మరియు అమ్యులెక్లను కట్టివేసి, ఇద్దరిని దేశము యొక్క ప్రధాన న్యాయాధిపతి యెదుటికి తీసుకువెళ్ళిరి.

ఆల్మా 8:29–30; 14:1–4

చిత్రం
ఆల్మా మరియు అమ్యులెక్ చేతులు కట్టబడి ఉన్నారు

తన ప్రజలు పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయాధిపతి నమ్మలేదు. ప్రజలు ఆల్మా మరియు అమ్యులెక్ పై కోపముగా ఉన్నారు. ఆల్మా మరియు అమ్యులెక్ బోధించిన వాటిని విశ్వసించే పురుషులను వారు పట్టణం విడిచి వెళ్ళేలా చేసారు. అప్పుడు వారు ప్రభువును నమ్మిన స్త్రీలను మరియు పిల్లలను అగ్నిలో పడేశారు.

ఆల్మా 14:3, 5–9, 14, 16

చిత్రం
ఆల్మా మరియు అమ్యులెక్ చాలా విచారంగా వున్నారు

బాధలో ఉన్న ప్రజలను చూసి అమ్యులెక్ చాలా బాధపడ్డాడు. వారిని రక్షించడానికి దేవుని శక్తిని ఉపయోగించమని ఆల్మాను కోరాడు. అయితే దేవుని ఆత్మ తనను అనుమతించదని ఆల్మా చెప్పాడు. స్త్రీలు, పిల్లలు ప్రభువుతో ఉంటారని అమ్యులెక్ చెప్పాడు. వారిని చంపిన వ్యక్తులకు ప్రభువు తీర్పు తీర్చును.

ఆల్మా 14:9–11

చిత్రం
ప్రధాన న్యాయాధిపతి నవ్వుతున్నాడు

ప్రభువు స్త్రీలను మరియు పిల్లలను రక్షించనందున ప్రధాన న్యాయాధిపతి ఆల్మా మరియు అమ్యులెక్లను ఎగతాళి చేశాడు. అతడు ఆల్మా మరియు అమ్యులెక్లను చెరసాలకు పంపాడు.

ఆల్మా 14:14–17

చిత్రం
చెరసాలలో ఆల్మా మరియు అమ్యులెక్

మూడు రోజుల తర్వాత, ప్రధాన న్యాయాధిపతి తన అబద్ధపు యాజకులతో చెరసాలకు వెళ్లాడు. వారు చాలా ప్రశ్నలు అడిగారు. కానీ ఆల్మా మరియు అమ్యులెక్ వారికి సమాధానం చెప్పలేదు.

ఆల్మా 14:18–19

చిత్రం
చెరసాలలో ఆల్మా,అమ్యులెక్లను చూసి నవ్వుతున్న ప్రధాన న్యాయాధిపతి

ప్రధాన న్యాయాధిపతి మరియు అతడి యాజకులు ఆల్మా, అమ్యులెక్లతో నీచమైనవి చేసారు. వారు ఆల్మా, అమ్యులెక్లకు ఆహారం లేదా నీరు కూడా ఇవ్వలేదు. మరియు వారు ఆల్మా, అమ్యులెక్ బోధించిన వాటిని గూర్చి ఎగతాళి చేశారు.

ఆల్మా 14:19–22

చిత్రం
ప్రధాన న్యాయాధిపతి ముందు ఆల్మా మరియు అమ్యులెక్ బంధింపబడ్డారు

ఆల్మా మరియు అమ్యులెక్ చాలా రోజులు బాధపడ్డారు. ప్రధాన న్యాయాధిపతి తన యాజకులతో మళ్లీ వచ్చారు. ఆల్మా మరియు అమ్యులెక్లకు దేవుని శక్తి ఉంటే, వారిని కట్టివేసిన తాళ్లను వారే తెంచుకోవాలని అతను చెప్పాడు. అప్పుడు అతడు వారిని నమ్ముతాడు.

ఆల్మా 14:23–24

చిత్రం
ఆల్మా మరియు అమ్యులెక్ లేచి నిలబడ్డారు

ఆల్మా మరియు అమ్యులెక్ దేవుని శక్తిని అనుభూతిచెందారు. వారు లేచి నిలబడ్డారు. ఆల్మాకు ప్రభువుపై విశ్వాసం ఉంది మరియు తాడులను తెంచే శక్తి కోసం అడిగాడు.

ఆల్మా 14:25–26

చిత్రం
తాడులు తెగిపోతున్నాయి

ఆల్మా మరియు అమ్యులెక్ తాళ్ళను తెంచారు. ప్రధాన న్యాయాధిపతి మరియు అతని యాజకులు భయపడ్డారు. వారు పారిపోవడానికి ప్రయత్నించారు, కానీ అప్పుడు భూమి కంపించడం ప్రారంభించింది.

ఆల్మా 14:26–27

చిత్రం
అమ్యులెక్, ఆల్మా ధ్వంసమైన చెరసాల పైన ఉన్నారు

చెరసాల గోడలు ప్రధాన న్యాయాధిపతి మరియు అతని ప్రధాన యాజకులపై పడ్డాయి, మరియు వారు మరణించారు. అయితే ప్రభువు ఆల్మా మరియు అమ్యులెక్లను సురక్షితంగా ఉంచారు. శబ్దం విన్న ప్రజలు ఏం జరిగిందో చూసేందుకు పరుగులు తీశారు. ఆల్మా, అమ్యులెక్ మాత్రమే చెరసాల నుండి బయటకు వచ్చారు. ప్రజలు ఆల్మా మరియు అమ్యులెక్‌లకు చాలా భయపడి పారిపోయారు.

ఆల్మా 14:27–29

ముద్రించు