“జెరెడ్ మరియు అతని కుటుంబము,” మోర్మన్ గ్రంథ కథలు (2023)
జెరెడ్ మరియు అతని కుటుంబము
ప్రభువు చేత నడిపించబడిన ఒక ప్రయాణము
యేసు క్రీస్తు పుట్టడానికి వేల సంవత్సరాలకు ముందు జెరెడ్ మరియు అతని కుటుంబము బాబేలులో నివసించారు. వారు ప్రభువుకు విధేయులయ్యారు. కానీ బాబేలులో అనేకమంది ప్రభువుకు అవిధేయులుగా ఉన్నారు. ఆ జనులు పరలోకం చేరడానికి ప్రయత్నించడానికి వారు ఒక గోపురాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. ప్రభువు జనుల భాషను మార్చేసారు ఆవిధంగా వారు ఒకరినొకరు అర్ధం చేసుకోలేరు.
జెరెడ్‌కి ఒక సోదరుడు ఉన్నాడు. ప్రభువు జెరెడ్ సోదరుడిని నమ్మారు. సహాయం కోసం ప్రభువుకు ప్రార్థించమని జెరెడ్ తన సోదరుని అడిగాడు. తన ప్రార్థనలో, జెరెడ్ యొక్క సోదరుడు తన కుటుంబము మరియు స్నేహుతుల భాషను మార్చవద్దని ప్రభువును అడిగాడు. ఆవిధంగా వారింకా ఒకరినొకరు అర్ధం చేసుకోగలరు.
ప్రభువు ప్రేమ మరియు దయను కలిగియున్నారు. ఆయన జెరెడ్ కుటుంబం మరియు స్నేహితుల భాషను మార్చలేదు. తరువాత, వారి కోసం ఒక ప్రత్యేక దేశాన్ని తాను సిద్ధపరిచానని జెరెడ్ యొక్క సహోదరునితో ప్రభువు చెప్పారు. ఆయన వారిని అక్కడికి నడిపిస్తానని ప్రభువు చెప్పారు.
జెరెడ్, అతని సోదరుడు వారి కుటుంబాలను, స్నేహితులను సమావేశపరుస్తారు. వారు తమ జంతువులను, అన్ని రకాల విత్తనాలను కూడ వారు సేకరించారు. తరువాత వారు తమ గృహాలను విడిచి, అరణ్యము గుండా ప్రయాణించారు. ప్రభువు మేఘము నుండి వారితో మాట్లాడుట ద్వారా వారిని నడిపించారు.
చాలా దూరం ప్రయాణించిన తరువాత, వారు ఒక సముద్రము వద్దకు వచ్చారు. వారు నాలుగు సంవత్సరాలు తీరము వద్ద నివసించారు. చాలాకాలం, జెరెడ్ యొక్క సహోదరుడు ప్రభువుకు ప్రార్థన చేయలేదు.
మరలా ప్రార్థించమని జెరెడ్ యొక్క సహోదరునితో ప్రభువు చెప్పారు. జెరెడ్ యొక్క సహోదరుడు పశ్చాత్తాపపడ్డాడు మరియు ప్రభువుకు ప్రార్థించాడు. ప్రభువు అతడిని క్షమించారు.
పడవలని పిలవబడిన ఓడలను నిర్మించడాన్ని ప్రభువు జెరెడ్ యొక్క సహోదరునికి నేర్పించారు. వాగ్దానదేశమునకు కుటుంబాలు సముద్రం మీదుగా పడవలపై ప్రయాణించవచ్చు.
జెరెడ్ యొక్క సహోదరుడు మరియు అతని కుటుంబము పడవలను నిర్మించారు. పడవలలోపల వెలుగు లేదని అతడు చూసాడు. చీకటిలో సముద్రాన్ని దాటి వారు ప్రయాణించాలా అని అతడు ప్రభువును అడిగాడు. పడవలు వెలుగు కలిగియుండటానికి ఒక మార్గాన్ని ఆలోచించమని జెరెడ్ యొక్క సహోదరుడికి ప్రభువు చెప్పారు.
జెరెడ్ యొక్క సహోదరుడు 16 చిన్న, స్పష్టమైన రాళ్ళను తయారు చేసాడు. వాటిని తాకి, ప్రకాశింప చేయమని అతడు ప్రభువును అడిగాడు. ప్రభువు తన చేయి చాపి తన వేలుతో ఒక్కొక్క రాయిని తాకారు. జెరెడ్ యొక్క సహోదరుడు ప్రభువు యొక్క వేలును చూడగలిగాడు. తన వలే ప్రభువు ఒక శరీరాన్ని కలిగియున్నారని అతడు ఆశ్చర్యపడ్డాడు.
జెరెడ్ యొక్క సహోదరుడు గొప్ప విశ్వాసాన్ని కలిగియున్నాడని ప్రభువు చెప్పారు. తరువాత ప్రభువు కనిపించి, తన ఆత్మ శరీరాన్ని జెరెడ్ యొక్క సహోదరునికి చూపించారు. “నేను యేసు క్రీస్తును,” అని ప్రభువు చెప్పారు. తాను రక్షకునిగా ఉండటానికి ఏర్పరచబడ్డానని ఆయన చెప్పారు. ప్రభువు జెరెడ్ యొక్క సహోదరునికి అనేక ఇతర విషయాలను బోధించారు.
జెరెడ్ యొక్క సహోదరుడు తన కుటుంబము, స్నేహితుల వద్దకు తిరిగి వెళ్ళాడు. అతడు ప్రభువుతో ఉన్నప్పుడు నేర్చుకున్న దానిని అతడు వ్రాసియుంచాడు. అతడు పడవలలో రాళ్ళను కూడా ఉంచాడు. ఇప్పుడు వారు తమ ప్రయాణం కోసం వెలుగును కలిగియున్నారు.
సముద్రాన్ని దాటడానికి కుటుంబాలు పడవలలోనికి వెళ్ళారు. ప్రభువు వారిని శ్రద్ధ తీసుకుంటారని వారు నమ్మకముంచారు. అక్కడ అనేక తుఫానులు మరియు అలలున్నాయి. కొన్నిసార్లు, నీళ్ళు పడవలను పూర్తిగా కప్పివేసాయి. కానీ వారు ప్రార్థించారు, మరియు ప్రభువు వారిని నీళ్లపైకి మరలా రప్పించారు. ప్రభువుకు కృతజ్ఞతలు తెలిపే అనేక పాటలు వారు పాడారు.
దాదాపు ఒక సంవత్సరం తరువాత, వారు ప్రభువు తమకు వాగ్దానము చేసిన దేశాన్ని చేరుకున్నారు. వారు ఆనందంతో కన్నీళ్లు కార్చి, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.