“యేసు తన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళును,” మోర్మన్ గ్రంథ కథలు (2023)
యేసు తన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళును
ఆయన వెళ్ళకముందు తన శిష్యులకు సేవ చేయడం
యేసు తన సువార్తను జనులకు బోధించారు. దేవుడిని ప్రేమించాలని, ఒకరికొకరు సేవ చేయాలని ఆయన వారికి బోధించారు. త్వరలో, యేసు తన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళును. ఆయన వెళ్ళిన తరువాత జనులకు బోధించుట కొనసాగించమని ఆయన శిష్యులను అడిగారు.
ఆయన వెళ్ళక ముందు, వారి కొరకు ఆయన ఏమి చేయాలని వారు కోరుకుంటున్నారు అని తన శిష్యులలో ప్రతి ఒక్కరినీ యేసు అడిగారు. శిష్యులలో అనేకమంది, భూమి మీద ఆయనకు సేవ చేయడం పూర్తి చేసిన తరువాత యేసుతో జీవించాలని వారు కోరుతున్నట్లు చెప్పారు. వారు చనిపోయిన తరువాత వారు తనతో జీవిస్తారని యేసు వాగ్దానమిచ్చారు.
ముగ్గురు శిష్యులు విచారించారు ఎందుకనగా వారు కోరుతున్న దానిని యేసుతో చెప్పడానికి చాలా ఆందోళన చెందారు. కానీ వారు తన నుండి కోరుతున్న దానిని యేసు ఎరుగును. జనులు యేసు వద్దకు రావడానికి సహాయపడేలా వారు రక్షకుని రెండవ రాకడ వరకు జీవించి ఉండాలని కోరుకున్నారు.
వారు చనిపోరని యేసు వారికి వాగ్దానమిచ్చారు. వారు భూమి మీద నిలిచియుండి, ఆయన రెండవ రాకడ వరకు ఆయన వద్దకు జనులు రావడానికి సహాయపడతారు.
నిలిచియుండాలని కోరుకున్న ముగ్గురు తప్ప ప్రతి శిష్యుడిని యేసు తన వేలుతో తాకుతారు. అప్పుడు యేసు వారిని విడిచి తన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళును.
దీని తరువాత, పరలోకాలు తెరవబడినవి మరియు ముగ్గురు శిష్యులు పరలోకానికి తీసుకొనిపోబడ్డారు. వారు అద్భుతమైన విషయాలను చూసారు, విన్నారు, మరియు వాటి గురించి మాట్లాడరాదని వారు చెప్పబడ్డారు. వారి శరీరాలు కూడా మార్చబడినవి ఆవిధంగా వారు చనిపోరు లేదా బాధను అనుభవించరు.
శిష్యులు తిరిగి వచ్చి యేసు గురించి జనులకు బోధించడం కొనసాగించారు. యేసును అనుసరించాలని కోరిన జనులు బాప్తిస్మము పొందారు. దేవుని ప్రేమ వారి హృదయాలలో ఉన్నది, మరియు వారికి కలిగినదంతా వారు ప్రతిఒక్కరితో పంచుకున్నారు. వారు సంతోషంగా ఉన్నారు, మరియు దేవుడు వారిని దీవించాడు. దాదాపు 200 సంవత్సరాలు ప్రతిఒక్కరు ప్రశాంతంగా జీవించారు.