లేఖన కథలు
యేసు పన్నెండుమంది శిష్యులను ఎంపిక చేయుట


“యేసు పన్నెండుమంది శిష్యులను ఎంపిక చేయుట,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

3 నీఫై 11; 13; 18

1:57

యేసు పన్నెండుమంది శిష్యులను ఎంపిక చేయుట

బోధించడానికి మరియు బాప్తీస్మమివ్వడానికి అధికారము

యేసు క్రీస్తు ఒక శిష్యుని తలపై తన చేతులు ఉంచి అతడిని దీవించును, మరియు వారి చుట్టూ జనులు నిలబడి ప్రార్థిస్తారు

యేసు క్రీస్తు సమృద్ధి పట్టణానికి వచ్చినప్పుడు, ఆయన పన్నెండుమంది అపొస్తులులను ఎంపిక చేసారు, బోధించడానికి మరియు బాప్తీస్మమివ్వడానికి వారికి అధికారము ఇచ్చారు. ఆయన వారికి పరిశుద్ధాత్మ వరమును ఇచ్చే అధికారాన్ని కూడ ఇచ్చారు. ఆయన వారిని తన శిష్యులుగా పిలిచారు. యేసు వారిని చేయమని బోధించిన విషయాలను శిష్యులు చేసారు.

3 నీఫై 11:1, 18–22, 41; 12:1; 15:11–12; 18:36–37

యేసు క్రీస్తు బోధించును, ఒక శిష్యుడు ఒకరికి బాప్తీస్మమిచ్చును, మరియు మిగిలిన శిష్యులు విని, గమనిస్తారు.

ఎలా బాప్తీస్మమివ్వాలో యేసు తన శిష్యులకు బోధించారు. వారు పలుకవలసిన మాటలను ఆయన వారికి చెప్పారు. వ్యక్తిని నీటిలో ముంచి, వారు తిరిగి బయటకు రావడానికి సహాయపడాలని ఆయన వారికి బోధించారు. యేసు వారికి బోధించిన విధానంలోనే ఎల్లప్పుడు బాప్తీస్మము పొందాలని వారికి చెప్పారు. పరిశుద్ధాత్మ గురించి కూడ ఆయన వారికి బోధించారు.

3 నీఫై 11:22–28, 35

యేసు క్రీస్తు తన శిష్యులలో ఒకరితో మాట్లాడారు

యేసు తన శిష్యులు ఒకరితో ఒకరి కలిసిపోవాలని, వాదించుకోరాదని కోరారు. వారు వాదించినప్పుడు, వారు ఆయన బోధనలను అనుసరించడం లేదని ఆయన చెప్పాడు.

3 నీఫై 11:28–30

యేసు క్రీస్తు జనులకు తన చేతిని చాపును, మరియు జనులు చిరునవ్వు నవ్వి, ఆలకిస్తారు.

ఆయనను విశ్వసించాలని, పశ్చాత్తాపపడాలని, మరియు బాప్తీస్మము పొందాలని జనులకు యేసు బోధించారు, ఆవిధంగా వారు పరలోక తండ్రితో తిరిగి జీవించగలరు.

3 నీఫై 11:31–33

యేసు క్రీస్తు తన శిష్యులతో, ఇతర జనులతో నడుచును మరియు వారికి బోధించును

వారు ఆయనను నమ్మిన యెడల, వారు పరలోక తండ్రిని నమ్ముతారని యేసు ఆయన శిష్యులకు చెప్పెను. పరిశుద్ధాత్మ యేసు మరియు పరలోక తండ్రి నిజమని తెలుసుకోవడానికి వారికి సహాయపడుతుంది.

3 నీఫై 11:35–36

యేసు క్రీస్తు తన శిష్యులు, జనులతో కూర్చున్నారు మరియు వారికి బోధిస్తారు

యేసు తన శిష్యులకు బోధించడం పూర్తి చేసినప్పుడు, వెళ్ళి, జనులందరికి బోధించమని ఆయన వారితో చెప్పారు. వారు ఏమి తినాలి, ఏమి తాగాలి, లేక ఏమి ధరించాలో అని చింతించవద్దని చెప్పారు. వారు పరలోక తండ్రికి సేవ చేసిన యెడల, పరలోక తండ్రి వారిని శ్రద్ధ తీసుకుంటారని ఆయన వారితో చెప్పారు.

3 నీఫై 11:41; 13:25–34