లేఖన కథలు
రాణి యొక్క విశ్వాసము


“రాణి యొక్క విశ్వాసము,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

“రాణి యొక్క విశ్వాసము,” మోర్మన్ గ్రంథ కథలు

ఆల్మా 18–19

రాణి యొక్క విశ్వాసము

క్రీస్తునందు సంతోషమును కనుగొనుట

నేలపై పడిపోయిన రాణి యొక్క భర్త

ఒక లేమనీయ రాణి తన భర్త లమోనైతో కలిసి పరిపాలించింది. ప్రభువు గురించి తనకు బోధించమని రాజు అమ్మోన్ అనే పేరుగల నీఫైయుని అడిగాడు అతనికి అమ్మోన్ చెప్పిన దానిని నమ్మాడు. రాజు మోకరించి ప్రార్థించి, తనను క్షమించమని ప్రభువును అడిగాడు. అతడు ప్రార్థించినప్పుడు, రాజు భూమి మీద పడిపోయాడు. అతడు చనిపోయినట్లుగా కనబడ్డాడు.

ఆల్మా 18:21, 24–42

పడిపోయిన తన భర్త వైపు చూస్తున్న రాణి

రాజు సేవకులు అతడిని రాణి దగ్గరకు తీసుకొనివెళ్ళారు. వారు అతడిని మంచంపై ఉంచారు. అతడు అక్కడ పడుకొని రెండు రోజులు మరియు రెండు రాత్రులు కదలలేదు.

ఆల్మా 18:43

సేవకునితో మాట్లాడుచున్న రాణి

ఆ సమయమందు, రాణి, ఆమె పిల్లలు చాలా విచారించారు. వారు రాజుతో ఉండి, అతని గురించి ఏడ్చారు. కొందరు జనులు రాజు సమాధి చేయబడాలని చెప్పారు. కానీ మొదట అమ్మోన్‌తో మాట్లాడాలని రాణి కోరింది. అతడు దేవుని శక్తిని కలిగియున్నాడని ఆమె విన్నది. రాణి సేవకులు అమ్మోన్‌ను రాణి వద్దకు రమ్మని అడిగారు.

ఆల్మా 18:43; 19:1–3, 5

అమ్మోన్‌తో మాట్లాడుచున్న రాణి

అతడు దేవుని ప్రవక్త అని తాను విన్నానని రాణి అమ్మోన్‌తో చెప్పింది. రాజును చూడటానికి వెళ్ళమని ఆమె అమ్మోన్‌ను అడిగింది. రాజు బ్రతికే ఉన్నాడని అమ్మోన్‌కు తెలుసు. రాజు నిద్రపోవునట్లు చేసింది దేవుని యొక్క శక్తి. ఆమె భర్త మరుసటి రోజు లేస్తాడని రాణితో అమ్మోన్‌ చెప్పాడు.

ఆల్మా 19:3–8

తన భర్తపై తన తలను ఉంచిన రాణి

రాణి అమ్మోన్‌ను నమ్మింది మరియు దేవునియందు గొప్ప విశ్వాసాన్ని కలిగియున్నది. తన భర్త మరుసటి రోజు లేస్తాడని ఆమె నమ్నింది. ఆమె గొప్ప విశ్వాసము వలన ఆమె దీవించబడిందని అమ్మోన్‌ చెప్పాడు. అతని స్వంత జనుల కంటె ఆమె ఎక్కువ విశ్వాసమును కలిగి ఉన్నదని అతడు రాణితో చెప్పాడు. రాణి తన భర్త దగ్గరగా ఉండి, రాత్రంతా కావలికాసింది.

ఆల్మా 19:9–11

తన భర్త లేచినందుకు రాణి సంతోషించింది.

మరుసటి రోజు రాజు మేల్కొన్నాడు. అతడు తాను యేసు క్రీస్తును చూసానని రాణితో చెప్పాడు. యేసు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో రాజు, రాణికి తెలుసు, మరియు వారి సంతోషంతో నింపబడ్డారు.

ఆల్మా 19:12–13