లేఖన కథలు
ప్రవక్తయైన సమూయేలు


“ప్రవక్తయైన సమూయేలు,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

హీలమన్ 13–16

3:6

ప్రవక్తయైన సమూయేలు

యేసు యొక్క పుట్టుక మరియు మరణము గురించి బోధించుట

నీఫైయులు సమూయేలును పట్టణం విడిచి వెళ్ళేలా చేస్తారు

సమూయేలు అనే పేరుగల లేమనీయ ప్రవక్త జరహేమ్లలోని నీఫైయులకు బోధించడానికి వెళ్ళాడు. పశ్చాత్తాపం గురించి అతడు బోధించాడు. నీఫైయులు వినలేదు మరియు పట్టణము నుండి అతడిని బయటకు గెంటివేసారు.

హీలమన్ 13:1–2

సమూయేలు ప్రార్థిస్తున్నాడు

సమూయేలు తన జనుల వద్దకు తిరిగి వెళ్ళబోతున్నాడు. కానీ నీఫైయులకు బోధించడానికి తిరిగి వెళ్ళమని ప్రభువు అతనికి చెప్పాడు.

హీలమన్ 13:2–3

సమూయేలు పట్టణం వెలుపల నిలబడి దానివైపు చూస్తాడు

సమూయేలు ఏమి చెప్పాలో అది అతనికి చెప్తానని ప్రభువు అన్నారు. సమూయేలు ప్రభువుకు విధేయుడయ్యాడు. అతడు జరహేమ్లకు తిరిగి వెళ్లాడు. కానీ నీఫైయులు అతడిని పట్టణంలోనికి రానివ్వలేదు.

హీలమన్ 13:3–4

సమూయేలు పట్టణం యొక్క గోడపై నిలబడి పెద్ద జన సమూహంతో మాట్లాడతాడు

సమూయేలు పట్టణం యొక్క గోడపైకి ఎక్కాడు. ప్రభువు తన హృదయంలో ఉంచిన విషయాలను అతడు చెప్పాడు. వారు చెడు విషయాలను చేస్తున్నారు కనుక వారు నాశనం చేయబడతారని అతడు జనులను హెచ్చారించాడు. పశ్చాత్తాపము మరియు యేసు క్రీస్తునందు విశ్వాసము మాత్రమే వారిని రక్షిస్తుందని అతడు చెప్పాడు. దేవుని కుమారుడైన యేసు, ఐదు సంవత్సరాలలో జన్మిస్తాడని అతడు చెప్పాడు.

హీలమన్ 13:4–11; 14: 2, 8, 12–18

సమూయేలు పట్టణం యొక్క గోడపై నిలబడి పెద్ద జన సమూహంతో మాట్లాడతాడు, మరియు అతని ప్రక్కన శిశువుగా యేసు, మరియ మరియు యోసేపు ఉన్న చిత్రము

యేసు పుట్టుక గురించి సూచనలు ఉంటాయని సమూయేలు చెప్పాడు. ఆ సూచనల కోసం చూడమని జనులతో అతడు చెప్పాడు. ఒక సూచన ఏదనగా ఒక రాత్రి చీకటి ఉండదు. మిగిలిన సూచనలు ఒక క్రొత్త నక్షత్రము ఉంటుంది మరియు ఆకాశంలో అనేక అద్భుతమైన విషయాలు కనిపిస్తాయి.

హీలమన్ 14:3–7

సమూయేలు మాట్లాడుతున్నాడు, మరియు అతని ప్రక్కన తన సమాధి వెలుపల మగ్దలేని మరియతో మాట్లాడుతున్న పునరుత్థానుడైన రక్షకుడు

యేసునందు విశ్వాసము కలిగియుండాలని సమూయేలు జనులను కోరాడు. యేసు చనిపోతాడని, పునరుత్థానము చెందుతాడని, ఆవిధంగా వారు పశ్చాత్తాపపడిన యెడల జనులందరూ రక్షించబడతారని అతడు చెప్పాడు.

హీలమన్ 14:28, 12–18

సమూయేలు మాట్లాడతాడు, అతని వెనుక చీకటి పట్టణము యొక్క చిత్రము ఒకటి ఉంది

యేసు మరణము గురించి సూచనలు ఉంటాయని సమూయేలు చెప్పాడు. జనులు సూర్యుడు, చంద్రుడు, లేదా నక్షత్రాలను చూడలేరు. మూడు రోజులు ఏ వెలుగు ఉండదు.

హీలమన్ 14:20, 27

సమూయేలు మాట్లాడుతున్నాడు, మరియు అతని ప్రక్కన మెరుపులతో మంటల్లో కాలిపోతున్న పట్టణము యొక్క చిత్రము ఒకటి ఉంది

అక్కడ ఉరుము మరియు మెరుపు ఉంటుంది. భూకంపాలు వస్తాయి మరియు పట్టణాలు నాశనం చేయబడతాయి.

హీలమన్ 14:21–27

సమూయేలు పట్టణం యొక్క గోడపై నిలబడతాడు, క్రింద కోపంతో ఉన్న జనులు బాణాలతో అతడిని కొట్టడానికి ప్రయత్నిస్తారు, కానీ అవన్నీ సమూయేలును తాకవు.

కొందరు జనులు సమూయేలును నమ్మారు, కానీ అనేకమంది నీఫైయులు అతనితో కోపంగా ఉన్నారు. అతని వైపు వారు రాళ్ళను విసిరారు మరియు బాణాలు వేసారు. సమూయేలు గోడపై నిలబడినప్పుడు ప్రభువు అతడిని కాపాడాడు. రాళ్ళు, బాణాలు ఏవీ అతడిని తాకలేదు.

హీలమన్ 16:1–2

కొందరు జనులు ప్రార్థించారు, ఆందోళనగా కనిపించారు, మిగిలిన జనులు కోపంగా ఉన్నారు, మరియు సమూయేలు వెళ్లిపోతాడు

ఎవరూ సమూయేలును కొట్టలేనప్పుడు, ఇంకా చాలామంది జనులు అతడి మాటలను నమ్ముతారు. కానీ అనేకమంది ఇంకా కోపంగా ఉన్నారు. వారు సమూయేలును పట్టుకొని అతడిని కట్టివేయాలని అనుకున్నారు. సమూయేలు తప్పించుకొని, ఇంటికి వెళతాడు. అతడు తన జనులకు బోధించుట కొనసాగించాడు.

హీలమన్ 16:3, 6–8

నీఫై పేరుగల ఒక ప్రవక్త ప్రవాహం ప్రక్కన ఉన్న వ్యక్తులతో మాట్లాడుతున్నాడు

సమూయేలును నమ్మిన నీఫైయులు పశ్చాత్తాపపడ్డారు మరియు ప్రవక్తయైన నీఫైచేత బాప్తీస్మము పొందారు. వారు యేసునందు విశ్వసించారు మరియు సమూయేలు వారికి చెప్పిన యేసు పుట్టుక గురించిన సూచనల కోసం గమనించారు.

హీలమన్ 16:13, 3–5; 3 నీఫై 1:8–8