“ఆల్మా మరియు అతని జనులు,” మోర్మన్ గ్రంథ కథలు (2023)
ఆల్మా మరియు అతని జనులు
కష్ట సమయాల్లో దేవుని నుండి బలం
ఆల్మా మరియు అతని ప్రజలు ఒక అందమైన దేశంలో నివసించారు. వారు విత్తనాలు నాటారు మరియు గృహాలు నిర్మించారు. అల్మా దేవుని యాజకుడు. ఒకరినొకరు ప్రేమించుకోవాలని అతడు తన ప్రజలకు బోధించాడు. ప్రజలు ఆల్మాను విన్నారు మరియు దేవుని ఆజ్ఞలను పాటించారు. వారి కుటుంబాలు పెరిగాయి, మరియు వారు ఒక నగరాన్ని నిర్మించారు.
ఒకరోజు, లేమనీయుల సైన్యం వచ్చింది. వారు దారి తప్పిపోయారు. లేమనీయులు తమ ఇంటికి వెళ్లే దారిని కనుగొనడంలో ఆల్మా వారికి సహాయం చేస్తే ఆల్మా ప్రజలను ఒంటరిగా వదిలిపెడతామని వాగ్దానం చేశారు. లేమనీయులు తమ దేశానికి ఎలా తిరిగి వెళ్లాలో ఆల్మా చూపించాడు.
లేమనీయులు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. బదులుగా, వారు భూమిని స్వాధీనం చేసుకున్నారు మరియు ఆల్మా ప్రజలను గమనించేందుకు కాపలాదారులను ఏర్పాటు చేశారు. వారు ఆల్మా ప్రజలపై అమ్యులోన్ అనే నీఫైయుడిని రాజుగా కూడా చేశారు. అమ్యులోన్ అబద్ధపు యాజకులకు నాయకుడు. అతడు మరియు అతని యాజకులు దేవుని ప్రవక్తను చంపారు మరియు అనేక ఇతర చెడ్డ పనులు చేశారు.
మోషైయ 17:12–13; 23:31–32, 37–39; 24:9
అమ్యులోన్ ఆల్మాపై కోపంగా ఉన్నాడు. అతడు ఆల్మా ప్రజలను చాలా కష్టపడి పని చేసేలా చేసాడు మరియు వారి పట్ల నీచంగా ప్రవర్తించేవాడు. ఆల్మా ప్రజలకు ఇది కష్టమైంది.
వారు సహాయం కోసం దేవుడిని ప్రార్థించారు. అమ్యులోన్ వారిని ప్రార్థించడం మానేయమని చెప్పాడు. ప్రార్థించే వారెవరైనా చంపబడతారని అతడు అన్నాడు.
ఆల్మా మరియు అతని ప్రజలు బిగ్గరగా ప్రార్థన చేయడం మానేశారు. బదులుగా, వారు తమ హృదయాల్లో ప్రార్థించుకున్నారు. దేవుడు వారి ప్రార్థనలు విన్నారు. ఆయన వారిని ఓదార్చారు మరియు తప్పించుకోవడానికి సహాయం చేస్తానని వాగ్దానం చేశారు. దేవుడు వారి శ్రమను సులభతరం చేశాడు. ప్రజలు దేవుని మాట విన్నప్పుడు వారు ఓపికగా, సంతోషంగా ఉన్నారు. ఆయన తమకు సహాయం చేస్తున్నాడని వారికి తెలుసు.
ఆల్మా ప్రజలు దేవుణ్ణి విశ్వసించారు మరియు ఆయనపై గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారు. ఒక రోజు, వారు బయలుదేరడానికి సమయం ఆసన్నమైందని దేవుడు చెప్పాడు. ఆ రాత్రి, ఆల్మా మరియు అతని ప్రజలు సిద్ధమయ్యారు. వారు తమ సమస్త జంతువులను మరియు ఆహారాన్ని సమకూర్చుకున్నారు. తెల్లవారుజామున, దేవుడు లేమనీయులను గాఢనిద్రలో పెట్టాడు. అప్పుడు ఆల్మా మరియు అతని ప్రజలు తప్పించుకొని రోజంతా ప్రయాణించారు.
ఆ రాత్రి, పురుషులు, మహిళలు మరియు పిల్లలు అందరూ దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. దేవుడు మాత్రమే తమకు సహాయం చేయగలడని వారికి తెలుసు. వారు చాలా రోజులు ప్రయాణం చేస్తూ జరహేమ్ల దేశానికి చేరుకున్నారు. నీఫైయులు వారిని స్వాగతించారు, మరియు ఆల్మా యేసు క్రీస్తుపై విశ్వాసం ఉంచడం గురించి అందరికీ బోధించాడు. చాలా మంది ప్రజలు విశ్వసించారు మరియు బాప్తిస్మము తీసుకున్నారు.