లేఖన కథలు
ప్రవక్తయైన మొరోనై


“ప్రవక్తయైన మొరోనై,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

మోర్మన్ 8; మొరోనై 1; 7; 10

ప్రవక్తయైన మొరోనై

యేసు క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమను కలిగియుండుట

మొరోనై కాలిపోతున్న పట్టణం వైపు చూస్తాడు

మొరోనై నీఫైయుల చివరి ప్రవక్త. నీఫైయులు మరియు లేమనీయుల మధ్య ఒక పెద్ద యుద్ధములో అతడు పోరాడాడు. అతని కుటుంబము మరియు అతనికి తెలిసిన ప్రతిఒక్కరు యుద్ధములో చనిపోయారు. దేశములోని జనులు దుర్మార్గులయ్యారు. యేసు క్రీస్తునందు విశ్వసించిన వారిని ఎవరినైనా వారు చంపేసారు మొరోనై యేసునందు విశ్వసించాడు. యేసే రక్షకుడని అతడు నిరాకరంచలేదు.

మోర్మన్ 8: 2–8; మొరోనై 1; 2–3

మొరోనై లోహపు పలకలను మోస్తున్నాడు మరియు సైనిక సమూహము నుండి వాటిని దాచాడు.

మొరోనై తండ్రి, మోర్మన్, తమ జనుల యొక్క చరిత్రను లోహపు పలకలపై వ్రాస్తున్నాడు. మోర్మన్ చనిపోకముందు, అతడు పలకలను మొరోనైకి ఇచ్చాడు. మొరోనై తన ప్రాణాన్ని, పలకలను కాపాడుకోవడానికి దాక్కోవాల్సి వచ్చింది.

మోర్మన్ 6:6; 8:–5, 13; మొరోనై 1:1–3

మొరోనై ఒక గుహలో కూర్చోని లోహపు పలకలపై వ్రాస్తాడు

మొరోనైకు జీవితం కష్టంగా ఉంది, కానీ అతడు నమ్మకంగా ఉన్నాడు. మోర్మన్ క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ, దాతృత్వము గురించి బోధించిన దానిని అతడు వ్రాసాడు. ఈ ప్రేమను పొందడానికి జనులు వారి హృదయము యొక్క పూర్ణ శక్తితో దేవునికి ప్రార్థించవలెనని మోర్మన్ చెప్పాడు. యేసును నిజముగా అనుసరించు వారికి దేవుడు దాతృత్వమును ఇస్తాడని అతడు చెప్పాడు.

మొరోనై 7:32–33, 40–48; 10:20–21, 23

ఆహారమివ్వబడిన ఒక కుటుంబం సంతోషంగా ఉన్నది, మరియు మొరోనై చిరునవ్వు నవ్వుతాడు

లేమనీయులలో కొందరు మొరోనైకు తెలిసిన ప్రతిఒక్కరిని చంపి మరియు అతడిని కూడా చంపాలని కోరినప్పటికినీ, అతడు వారిని ప్రేమించాడు. అతడు భవిష్యత్తులో లేమనీయులకు సహాయపడటానికి లోహపు పలకలపై అనేక విషయాలను వ్రాసాడు. ఏదో ఒక రోజు వారు నివేదికను చదివి, మరలా యేసునందు విశ్వసిస్తారని అతడు ఆశించాడు.

మోర్మన్ 8:1–3; మొరోనై 1–4; 10:1

మొరోనై ఒక గడ్డి కొండపై కూర్చోని లోహపు పలకలపై వ్రాస్తాడు

దేవుడు తన పిల్లలందరి కోసం ఎలా ప్రేమగా శ్రద్ధ తీసుకున్నారో ఆలోచించమని నివేదికను చదివే జనులందరిని మొరోనై ఆహ్వానించాడు. గ్రంథము సత్యమో కాదో ప్రార్థన చేసి దేవుడిని అడగమని అతడు వారిని ఆహ్వానించాడు. వారు యేసునందు విశ్వాసము కలిగియున్న యెడల, నిజంగా తెలుసుకోవాలని కోరిన యెడల, వారు సత్యము తెలుసుకునేలా దేవుడు చేస్తారని అతడు చెప్పాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు తెలుసుకుంటారు.

మోర్మన్ గ్రంథమునకు పీఠిక; మొరోనై 10:1–5

మొరోనై లోహపు పలకలను పాతిపెట్టాడు మరియు దాచబడిన స్థలముపైగా ఒక రాయిని కదిలించాడు.

మొరోనై నివేదికను వ్రాయడం ముగించాడు. తరువాత అతడు లోహపు పలకలను భూమిలో పాతిపెట్టాడు. పలకలపై వ్రాయబడిన చరిత్ర ఒక రోజు ప్రపంచమంతటా దేవుని పిల్లల జీవితాలను దీవిస్తుందని మొరోనైకు యేసు చెప్పారు.

మోర్మన్ 8:4, 14–16

యువకుడైన జోసెఫ్ స్మిత్ ఒక రాయిని కదిలించి, లోహపు పలకలు మరియు లియహోనాను చూస్తాడు.

అనేక సంవత్సరాల తరువాత, దేవుడు, జోసెఫ్ స్మిత్ అనే పేరుగల బాలునికి పలకలు పాతిపెట్టబడిన ప్రదేశాన్ని చూపడానికి ఒక దేవదూతగా మొరోనైను పంపుతాడు. జోసెఫ్ స్మిత్‌ ఒక ప్రవక్తగా ఉండడానికి దేవుని చేత పిలవబడ్డాడు. వాటిపై వ్రాయబడిన వాటిని జనులు చదువునట్లు పలకలను అనువదించడానికి జోసెఫ్ స్మిత్‌కు దేవుడు సహాయపడ్డాడు. ఆ గ్రంథము ఇప్పుడు మోర్మన్ గ్రంథము అని పిలవబడింది.

మోర్మన్ గ్రంథమునకు పీఠిక