లేఖన కథలు
యేసు సంస్కారమును పంచుకొనుట


“యేసు సంస్కారమును పంచుకొనుట,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

3 నీఫై 18; 20

యేసు సంస్కారమును పంచుకొనుట

ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొనుట

యేసు క్రీస్తు పెద్ద జన సమూహంతో మాట్లాడతారు, మరియు ఆయన శిష్యులు ఆయన వద్దకు రొట్టెను మరియు ద్రాక్షారసముగల పాత్రలను తెస్తారు

యేసు రోగులను స్వస్థపరచి, చిన్న బిడ్డలను దీవించిన తరువాత, ఆయనను వినుటకు సమావేశమైన జనులందరికీ సంస్కారాన్ని పరిచయం చేస్తారు. ఆయన తన శిష్యులను కొంత రొట్టె, ద్రాక్షారసాన్ని తెమ్మని అడిగారు.

3 నీఫై 17; 18:1–2

యేసు క్రీస్తు రొట్టెను సగానికి విరిచి తన శిష్యులకు ఇస్తారు

యేసు రొట్టెను విరిచి, దానిని దీవించారు. దానిని ఆయన శిష్యులకు తినడానికి ఇచ్చారు. ఆయన జనులందరికి రొట్టెను ఇమ్మని శిష్యులను అడిగారు.

3 నీఫై 18:3–4, 6

యేసు క్రీస్తు రొట్టె ముక్కను పట్టుకొనెను, ఆయన వెనుక సిలువ మరియు ఖాళీ సమాధి యొక్క దృశ్యాలు

ఆయన యందు విశ్వాసముంచి, బాప్తీస్మము పొందిన ప్రతిఒక్కరు రొట్టెను తినాలని యేసు చెప్పారు. వారు చేసినప్పుడు, వారు ఆయన శరీరాన్ని జ్ఞాపకముంచుకోవాలి. ఆయన చేతులు, పాదాలలోని మేకుల గుర్తులను, మరియు ఆయన ప్రక్కలో గాయాన్ని వారు తాకి చూసినప్పటి సమయాన్ని ఆయన జనులకు గుర్తు చేసారు.

3 నీఫై 11:14–15; 18:3–7

యేసు క్రీస్తు తన శిష్యులలో ఒకరికి ద్రాక్షారసముగల పాత్రను ఇచ్చారు

తరువాత యేసు శిష్యులు తాగడానికి ద్రాక్షారసాన్ని ఇచ్చారు. ఆయన జనులందరికి ద్రాక్షారసాన్ని ఇమ్మని శిష్యులను అడిగారు.

3 నీఫై 18:8–9

గెత్సేమనే తోటలో మోకరించి ప్రార్థిస్తున్న యేసు క్రీస్తు

పశ్చాత్తాపము చెంది, బాప్తీస్మము పొందిన ప్రతిఒక్కరు ద్రాక్షారసాన్ని త్రాగాలని యేసు చెప్పారు. ద్రాక్షారసాన్ని త్రాగిన ప్రతిఒక్కరు ఆయన రక్తాన్ని గుర్తుంచుకోమని ఆయన అడిగారు. ఆయన శ్రమలుపడి, వారికోసం చనిపోయినప్పుడు ఆయన తన రక్తాన్ని ఇచ్చానని వారికి గుర్తు చేసారు.

3 నీఫై 18:11

యేసు క్రీస్తు జనులతో మాట్లాడతారు

రొట్టెను తినుట మరియు ద్రాక్షారసాన్ని త్రాగడం ఒక ఆజ్ఞ అని యేసు అన్నారు. రొట్టెను తిని, ద్రాక్షారసాన్ని త్రాగడం ద్వారా, జనులు ఆయన ఆజ్ఞలను పాటించాలని మరియు యేసును గుర్తుంచుకోవాలని కోరుతున్నారని వారు పరలోక తండ్రికి చూపించారు. వారు ఈ విషయాలను చేసిన యెడల వారు పరిశుద్ధాత్మతో దీవించబడతారని యేసు అన్నారు.

3 నీఫై 18:7, 10–14

యేసు క్రీస్తు జనులతో మాట్లాడతారు, మరియు వారు ఆయనను చూసి చిరునవ్వు చిందిస్తారు

జనులు రొట్టెను తిని, ద్రాక్షారసాన్ని త్రాగిన తరువాత, వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అప్పుడు జనులు యేసును స్తుతించారు.

3 నీఫై 18:4–5, 9; 20:9