Scripture Stories
టియాంకమ్ మరియు మొరోనై


“టియాంకమ్ మరియు మొరోనై,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

ఆల్మా 62

టియాంకమ్ మరియు మొరోనై

గొప్ప ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు

చిత్రం
లేమనీయుల సైన్యంతో కలసి అమ్మోరోన్‌, నీఫైయుల సైన్యంతో పోరాడుతున్నాడు

అమలిక్యా మరణించిన తరువాత, అతని సహోదరుడు అమ్మోరోన్ లేమనీయుల రాజు అయ్యాడు. అమ్మోరోన్ నీఫైయులతో పోరాడుతూనే ఉన్నాడు. యుద్ధం సంవత్సరాల పాటు కొనసాగింది. నీఫైయులు గెలవడం ప్రారంభించారు, కాబట్టి లేమనీయుల సైన్యాలన్నీ ఒక నగరానికి పారిపోయాయి. మొరోనై, టియాంకమ్ మరియు మరొక నీఫైయుల సైన్యాధికారి వారి సైన్యాలతో లేమనీయులను అనుసరించారు.

ఆల్మా 52:3–4; 54:16–24; 62:12–35.

చిత్రం
టియాంకమ్ ఒక జావెలిన్ పట్టుకొని రాత్రికి నగరానికి చేరుకున్నాడు

అమలిక్యా మరియు అమ్మోరోన్ ఈ పెద్ద, సుదీర్ఘ యుద్ధానికి కారణమయ్యారని టియాంకమ్ కోపంగా ఉన్నాడు. యుద్ధం కారణంగా, చాలా మంది మరణించారు మరియు చాలా తక్కువ ఆహారం ఉంది. టియాంకమ్ యుద్ధాన్ని ముగించాలనుకున్నాడు. అతను అమ్మోరోన్ కోసం రాత్రి పట్టణంలోకి వెళ్ళాడు.

ఆల్మా 62:35–36

చిత్రం
టియాంకమ్ కొక్కెంతో తాడును పట్టుకుని ప్రాకారములపైనుండి క్రిందికి దూకెను

టియాంకమ్ పట్టణ ప్రాకారములపైకి ఎక్కాడు. అమ్మోరోన్ ఎక్కడ నిద్రిస్తున్నాడో కనుగొనే వరకు అతడు పట్టణంలో ఒక చోటు నుండి మరొక చోటుకు ముందుకు వెళ్ళాడు.

ఆల్మా 62:36

చిత్రం
టియాంకమ్ శిబిరం ప్రవేశద్వారం వద్ద ఈటె మరియు తాడుతో నిలబడ్డాడు

టియాంకమ్ అమ్మోరోన్‌పై ఈటెను విసిరాడు. అది అతని గుండె దగ్గర గుచ్చుకొనెను. కానీ అమ్మోరోన్ చనిపోవుటకు ముందు తన సేవకులను మేల్కొల్పాడు.

ఆల్మా 62:36

చిత్రం
టియాంకమ్ లేమనీయుల సైనికులను ఈటెలతో ఎదుర్కన్నాడు

అమ్మోరోన్ సేవకులు టియాంకమ్‌ను తరిమి, అతడిని సంహరించారు. టియాంకమ్‌ మరణించాడని ఇతర నీఫైయుల నాయకులు మిక్కిలిగా దుఃఖించారు. అతడు తన ప్రజల స్వేచ్ఛ కోసం ధైర్యంగా పోరాడాడు.

ఆల్మా 62:36–37

చిత్రం
నీఫైయుల సైనికులు లేమనీయుల సైనికులను బంధించారు

అతడు చనిపోయినప్పటికీ, టియాంకమ్‌ నీఫైయులు యుద్ధంలో విజయం సాధించడంలో సహాయం చేశాడు. అతడు లేమనీయులు తమ నాయకుడిని కోల్పోయేలా చేశాడు. మరుసటి రోజు ఉదయం, మొరోనై లేమనీయులతో పోరాడి గెలిచాడు. లేమనీయులు నీఫైయులు దేశాన్ని విడిచిపెట్టారు, మరియు యుద్ధం ముగిసింది.

ఆల్మా 62:37–38

చిత్రం
సైన్యాధికారియైన మొరోనై ఒక గ్రామాన్ని నిర్మించడానికి పురుషులను నిర్దేశిస్తాడు, మరియు కుటుంబాలు గమనిస్తున్నాయి.

చివరకు శాంతి నెలకొంది. మొరోనై నీఫైయుల భూమిని లేమనీయుల నుండి సురక్షితంగా చేయడానికి చాలా కష్టపడ్డాడు. అప్పుడు మొరోనై ప్రశాంతంగా జీవించడానికి ఇంటికి వెళ్ళాడు. ప్రవక్తలు సువార్త బోధించారు మరియు దేవుని సంఘాన్ని నడిపించారు. ప్రజలు ప్రభువును విశ్వసించారు, ఆయన వారిని ఆశీర్వదించాడు.

ఆల్మా 62:39–51

ముద్రించు