లేఖన కథలు
సముద్రాన్ని దాటడానికి ఒక ఓడ


“సముద్రాన్ని దాటడానికి ఒక ఓడ,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

“సముద్రాన్ని దాటడానికి ఒక ఓడ,” మోర్మన్ గ్రంథ కథలు

1 నీఫై 17–18

సముద్రాన్ని దాటడానికి ఒక ఓడ

వాగ్దాన దేశానికి వెళ్లడానికి సిద్ధపడుట

సముద్రము వద్ద కుటుంబాలు

సమృద్ధి పండ్లు, తేనేతో నిండిన దేశము. అది నివసించడానికి అందమైన ప్రదేశము. లీహై మరియు శరయ కుటుంబము సముద్రము వద్ద నివసించారు మరియు వారికి అవసరమైనదంతా కలిగియున్నారు.

1 నీఫై 17:5–6

ప్రార్థిస్తున్న నీఫై

చాలా రోజుల తరువాత, ప్రార్థన చేయడానికి కొండపైకి వెళ్ళమని ప్రభువు నీఫైతో చెప్పారు. అక్కడ, అతని కుటుంబాన్ని సముద్రం దాటించడానికి ఓడను నిర్మించమని ప్రభువు అతనితో చెప్పారు.

1 నీఫై 17:7–8

రాళ్ళను చూస్తున్న నీఫై

ఓడ ఎలా నిర్మించాలో ప్రభువు నీఫైకు చూపించారు. కానీ సాధనాలను చేయడానికి లోహాన్ని ఎక్కడ వెదకాలో నీఫైకు తెలియలేదు. లోహం కోసం ఎక్కడ వెదకాలో ప్రభువు నీఫైకు చూపించారు.

1 నీఫై 17:8–10

నీఫై పనిచేస్తుండగా మాట్లాడుకుంటున్న లేమన్, లెముయెల్

తరువాత, నీఫై సాధనాలను తయారు చేయడానికి మంట వెలిగించాడు. లేమన్, లెముయెల్ వారి తమ్ముడైన నీఫైను గమనించారు. ఓడ కట్టడానికి అతడికి సహాయపడటానికి వారు ఇష్టపడలేదు. సముద్రాన్ని దాటడం చెడు ఆలోచన అని వారు అనుకున్నారు.

1 నీఫై 17:11, 16–18

నీఫైపై కోపగించిన లేమన్, లెముయెల్

ఒక ఓడ నిర్మించమని ప్రభువు నీఫైతో చెప్పారని లేమన్, లెముయెల్ నమ్మలేదు. వారు ఎందుకు ప్రభువునందు విశ్వాసం కలిగిలేరని నీఫై వారిని అడిగారు. వారు ఒక దూతను చూసారని మరియు ప్రభువు యొక్క శక్తి వారికి తెలుసని అతడు తన అన్నలకు గుర్తు చేసాడు. లేమన్, లెముయెల్‌కు ఎంత కోపం వచ్చిందంటే వారు నీఫైను చంపాలనుకున్నారు.

1 నీఫై 17:18–19; 45–48

నేలపై లేమన్, లెముయెల్

కానీ నీఫై దేవుని శక్తితో నింపబడ్డాడు. తనను తాక వద్దని నీఫై లేమన్, లెముయెల్‌ను హెచ్చరించాడు. వారు భయపడి చాలారోజులు నీఫైను తాకడానికి సాహసించలేదు. తరువాత ప్రభువు నీఫైతో తన అన్నలకు తన చేతిని చాపమని చెప్పారు. నీఫై వారిని తాకినప్పుడు, వారు ప్రభువు శక్తి చేత కదిలించబడ్డారు.

1 నీఫై 17:48, 52–55

ఓడ మీద ప్రతిఒక్కరు పని చేస్తున్నారు

లేమన్, లెముయెల్ ప్రభువును ఆరాధించారు మరియు ఓడను నిర్మించడానికి సహాయపడ్డారు. నీఫై సహాయము కొరకు అనేకసార్లు ప్రభువుకు ప్రార్థన చేసాడు. నీఫై కుటుంబము నిర్మించిన ఓడ అందమైనది. చాలా రోజుల తరువాత, ఓడ పూర్తి చేయబడింది, మరియు అది మంచిదని వారు చూసారు. ప్రభువు వారికి సహాయపడ్డారని నీఫై కుటుంబానికి తెలుసు.

1 నీఫై 18:14