లేఖన కథలు
ఆంటై-నీఫై-లీహైయులు


“ఆంటై-నీఫై-లీహైయులు,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

ఆల్మా 23–27

ఆంటై-నీఫై-లీహైయులు

తమ శత్రువులను ప్రేమించాలని ఎంచుకున్న వ్యక్తులు

అమ్మోన్ చెట్టు కింద ప్రజలకు బోధించేవాడు

చాలా మంది లేమనీయులు అమ్మోన్ మరియు అతని సోదరుల నుండి దేవుని గురించి తెలుసుకున్నారు. ఈ లేమనీయులు ప్రభువుపై బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు మరియు దేవుని ఆజ్ఞలను అనుసరించారు. వారు కొత్త పేరును కోరుకున్నారు, కాబట్టి వారు తమను తాము లేమనీయులకు బదులుగా ఆంటై-నీఫై-లీహైయులు అని పిలుచుకున్నారు.

ఆల్మా 23:3–7, 16-17

అమ్మోన్ బోధ వింటున్న కుటుంబాలు

దేవుడిపై ఉన్న విశ్వాసం కారణంగా ఆంటై-నీఫై-లీహైయులు మారిపోయారు. వారు చేసే చెడు పనుల నిమిత్తము వారు పశ్చాత్తాపపడ్డారు. దేవుడు తమను ప్రేమిస్తున్నాడని మరియు క్షమించాడని వారికి తెలుసు.

ఆల్మా 24:8–14

ఆంటై-నీఫై-లీహైయులు ఆయుధాలను తెరవబడిన గోతిలోనికి విసిరేసారు.

లేమనీయుల ద్వేషము మిక్కిలి తీవ్రమాయెను మరియు వారు ఆంటై-నీఫై-లీహైయులపై దాడి చేయడానికి సిద్ధమాయెను. పోరాడటానికి బదులుగా, ఆంటై-నీఫై-లీహైయులు దేవునికి ఒక వాగ్దానం చేసారు. వారు తాము ఇకపై ప్రజలను బాధపెట్టబోమని చెప్పారు. దీన్ని చూపించడానికి, వారు తమ ఆయుధాలను పాతిపెట్టారు. వారు తమ శత్రువులను బాధపెట్టడానికి లేదా చంపడానికి బదులుగా వారిని ప్రేమించాలని ఎంచుకున్నారు.

ఆల్మా 24:1–19; 26:31–34

కోపంతో ఉన్న లేమనీయుడు ఆయుధాన్ని పట్టుకున్నాడు

దేవునియందు విశ్వసించని లేమనీయులు ఆంటై-నీఫై-లీహైయులపై దాడి చేశారు.

ఆల్మా 24:20

ఇద్దరు ఆంటై-నీఫై-లీహైయులు ప్రార్థనలో మోకరిల్లారు

వారు చంపబడినట్లయితే, వారు దేవునితో జీవిస్తారని ఆంటై-నీఫై-లీహైయులు విశ్వాసం కలిగి ఉన్నారు. వారు దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు మరియు లేమనీయులతో పోరాడలేదు.

ఆల్మా 24:16, 21

లేమనీయులు దాడి చేయడం ఆపివేస్తారు

పోరాటానికి బదులుగా, ఆంటై-నీఫై-లీహైయులు ప్రార్థన చేశారు. దీనినిలేమనీయులు చూసినప్పుడు, చాలామంది దాడి చేయడం మానేశారు. ప్రజలను చంపినందుకు వారు బాధపడ్డారు. ఆ లేమనీయులు కూడా ప్రజలను మళ్లీ బాధపెట్టకూడదని ఎంచుకున్నారు. వారు ఆంటై-నీఫై-లీహైయులలో చేరారు.

ఆల్మా 22:23–27; 25:13–16

అమ్మోన్ మరియు ఆంటై-నీఫై-లీహైయుల ప్రయాణం

కాలం గడిచేకొద్దీ, మరింత మంది దాడి చేశారు. అమ్మోన్ మరియు అతని సహోదరులు ఆంటై-నీఫై-లీహైయులు బాధలు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. నీఫైయులతో నివసించడానికి తన ప్రజలను తీసుకెళ్లమని వారు రాజును కోరారు. ప్రభువు కోరితే వారు వెళతారని రాజు చెప్పాడు. అమ్మోన్ ప్రార్థించాడు. ప్రభువు వారు వెళ్ళవలెనని మరియు ఆయన వారిని కాపాడుతానని చెప్పారు.

ఆల్మా 27:2–15

నీఫైయులు ఆంటై-నీఫై-లీహైయుల ప్రజలను అభినందించారు

నీఫైయులు ఆంటై-నీఫై-లీహైయుల‌కు నివసించడానికి భూమిని ఇచ్చారు మరియు వారిని రక్షించారు. ప్రతిగా, ఆంటై-నీఫై-లీహైయుల‌కు నీఫైయులకు ఆహారం ఇచ్చారు. ఆంటై-నీఫై-లీహైయుల‌ు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నారు మరియు దేవుణ్ణి ప్రేమించేవారు. వారు ప్రతి ఒక్కరితో నిజాయితీగా ఉన్నారు మరియు ఎప్పుడూ పోరాడకుండా వారి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. వారు జీవితాంతం విశ్వాసపాత్రంగా ఉన్నారు.

ఆల్మా 27:20–30