లేఖన కథలు
గిడియన్, ఆల్మా, మరియు నీహోర్


“గిడియన్, ఆల్మా, మరియు నీహోర్,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

“గిడియన్, ఆల్మా, మరియు నీహోర్,” మోర్మన్ గ్రంథ కథలు

ఆల్మా 1

గిడియన్, ఆల్మా, మరియు నీహోర్

దేవుని మాటలతో సత్యమును కాపాడుట

తన తండ్రిని వింటున్న చిన్నవాడగు ఆల్మా

నీఫైయులు చిన్నవాడగు ఆల్మాను వారి ప్రధాన న్యాయాధిపతిగా ఎంపిక చేసారు. ఆల్మా సంఘముపై ప్రధాన యాజకుడు కూడా.

మోషైయ 29:41–44

నీహోర్ ఆకాశం వైపు చూపిస్తున్నాడు

నీహోర్ అనే పేరుగల వ్యక్తి జనులకు బోధిస్తున్నాడు అతడు దానిని దేవుని వాక్యమని పిలిచాడు. కాని అతడు దేవునికి విధేయులు కానవసరం లేదని లేదా పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదని జనులకు బోధించాడు.

ఆల్మా 1:2–4, 15

నీహోర్‌కు డబ్బు తెచ్చి ఇస్తున్న జనులు

అనేకమంది నీహోర్ చెప్పిన దానిని ఇష్టపడ్డారు మరియు నమ్మారు. అతడు జనులు తనకు డబ్బు ఇవ్వాలని, అతడిని పొగడాలని కోరాడు. తాను మిగిలిన జనులకంటె మంచివాడనని అతడు అనుకున్నాడు. అతడు తన స్వంత సంఘాన్ని ఏర్పాటు చేసాడు, మరియు అనేకమంది అతడిని విన్నారు.

ఆల్మా 1:3, 5–6

గిడియన్‌తో వాదిస్తున్న నీహోర్

ఒకరోజు, నీహోర్ వృద్ధుడైన గిడియన్‌ను కలిసాడు. గిడియన్ దేవుని సంఘములో ఒక బోధకుడు మరియు చాలా మేలు చేసాడు. నీహోర్ జనులు సంఘాన్ని విడిచి పెట్టాలని కోరాడు, అందువలన అతడు గిడియన్‌తో వాదించాడు. నీహోర్ బోధిస్తున్నది సత్యము కాదని చూపడానికి గిడియన్ దేవుని మాటలను ఉపయోగించాడు. నీహోర్‌కు కోపం వచ్చింది! అతడు గిడియన్‌ను తన కత్తితో చంపాడు.

ఆల్మా 1:79,13

ఆల్మాతో వాదిస్తున్న నీహోర్

తీర్పు తీర్చడానికి జనులు నీహోర్‌ను ఆల్మా వద్దకు తీసుకెళ్ళారు. నీహోర్ తాను చేసిన దానిని సమర్ధించుకోవడానికి ప్రయత్నించాడు. అతడు శిక్షంచబడటానికి ఇష్టపడలేదు.

ఆల్మా 1:10–11

తీర్పు తీరుస్తున్న ఆల్మా

నీహోర్ బోధనలు తప్పని, జనులను గాయపరుస్తాయని ఆల్మా చెప్పాడు. ఆల్మా చట్టమును అనుసరించాడు. నీహోర్ గిడియన్‌ను చంపాడు కనుక నీహోర్ చంపబడాలి.

ఆల్మా 1:12–5

ఆల్మా జనుల గురించి ఆలోచిస్తున్నాడు

అతడు చనిపోకముందు, తాను అబద్ధాలు చెప్పానని జనులతో నీహోర్ చెప్పాడు. అతడు దేవుని వాక్యమును బోధించలేదు. తాను తప్పని నీహోర్ చెప్పినప్పటికినీ, అనేకమంది అతడి మాదిరిని అనుసరించారు. వారు డబ్బు, పొగడ్తలు పొందడానికి జనులతో అబద్ధాలు చెప్పారు. కానీ మిగిలిన వారు ఆల్మా చెప్పినది విన్నారు. వారు పేద వారిని శ్రద్ధ తీసుకున్నారు మరియు దేవుని ఆజ్ఞలను పాటించారు.

ఆల్మా 1:15–16, 25–30