లేఖన కథలు
యువ సైన్యము యొక్క తల్లులు


“యువ సైన్యము యొక్క తల్లులు,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

ఆల్మా 24; 53; 56–57

2:9

యువ సైన్యము యొక్క తల్లులు

దేవుడిని విశ్వసించమని పిల్లలకు బోధించుట

ఒక తల్లి తన యుక్తవయస్సు కుమారులకు బోధిస్తుండగా వారు వింటున్నారు మరియు ఒక చిన్న బాలిక దగ్గరలో ఆడుకుంటుంది.

ఆంటై-నీఫై-లీహైయులు ప్రభువును, జనులందరిని ప్రేమించారు. వారు ఎల్లప్పుడు దేవుడిని విశ్వసించవచ్చు అని ఆ తల్లులు తమ పిల్లలకు బోధించారు. ఆయన ఆజ్ఞలను పాటించమని వారు వీరికి బోధించారు.

ఆల్మా 26:31–34; 27:12, 27–30; 56:47–48; 57:21, 26

హీలమన్ మరియు ఇతర నీఫైయులు కాలిపోతున్న పట్టణం వైపు చూసారు.

నీఫైయులు మరియు లేమనీయులు పెద్ద యుద్ధంలో ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. నీఫైయులు తమ స్వంత జనులను మరియు ఆంటై-నీఫై-లీహైయులను కాపాడటానికి పోరాడుతున్నారు.

ఆల్మా 48–52; 53:10–13

ఆంటై-నీఫై-లీహైయులు హీలమన్ మరియు మరొక నీఫైయునితో మాట్లాడారు.

వారి యొక్క పూర్వ పాపముల వలన, ఆంటై-నీఫై-లీహైయులు ఎవరితోనూ ఎప్పుడూ పోరాడమని దేవునితో ఒక నిబంధన లేదా ప్రత్యేక వాగ్దానము చేసారు. కానీ వారు నీఫైయులను ప్రేమించారు మరియు సహాయపడాలని కోరుకున్నారు.

ఆల్మా 24:6–19; 53:10–13

ఆంటై-నీఫై-లీహైయుల కుమారులు ఒకరినొకరితో మాట్లాడుకుంటున్నారు మరియు వారి తల్లిదండ్రులు హీలమన్ మరియు మరొక నీఫైయునితో మాట్లాడటం గమనించారు.

ఆంటై-నీఫై-లీహైయులు యుద్ధములో పోరాడబోతున్నారు. వారు పోరాడకూడదనే వారి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ప్రవక్త హీలమన్, ఇతర సంఘ నాయకులు వారిని ఒప్పించారు. ఆంటై-నీఫై-లీహైయులు వారి స్నేహితులు మిక్కిలి బాధను, ఇబ్బందిని అనుభవించడం చూసారు, కానీ వారు దేవునితో చేసిన నిబంధనను నిలబెట్టుకున్నారు.

ఆల్మా 53:13–15

కుమారులు వారి చేతులను పైకెత్తారు, వారి తల్లిదండ్రులు మరియు నీఫైయులు వారి మాట విన్నారు.

ఆంటై-నీఫై-లీహైయుల కుమారులు వారి తల్లిదండ్రులు చేసిన వాగ్దానమును వారు చేయలేదు. ఇప్పుడు వారు స్వేచ్ఛ కోసం పోరాడతామని తమ వాగ్దానము చేసారు.

ఆల్మా 53:16–17

కుమారులు ఒక నీఫైయుల సైనికుని నుండి బల్లెమును తీసుకున్నారు, వారి తల్లులు, తండ్రులు ప్రార్థన చేసి, గమనిస్తున్నారు.

వారు గొప్ప ధైర్యాన్ని కలిగియున్నారు. వారు సందేహించని యెడల, దేవుడు వారిని కాపాడతారని, వారు తమ తల్లుల నుండి నేర్చుకున్నారు.

ఆల్మా 53:20; 56:47

కుమారులు కవచాన్ని ధరించారు మరియు వారి తల్లులు, తండ్రులతో మాట్లాడుతున్నారు, మరియు హీలమన్ కవచాన్ని ధరించి దగ్గరలో నిలబడ్డాడు.

కుమారులు వారి తల్లులను నమ్మారు. కుమారులు దేవునిపట్ల విశ్వాసంగా ఉన్నారు మరియు ఆయన ఆజ్ఞలను పాటించారు. దేవుడు వారిని కాపాడతారని వారు నమ్మారు. దేవుడు వారి కుమారులను కాపాడతాడని ఆ తల్లులకు తెలుసు.

ఆల్మా 53:20–21; 56:47–48; 57:20–21, 26