లేఖన కథలు
సముద్రముపై ఒక తుఫాను


“సముద్రముపై ఒక తుఫాను,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

“సముద్రముపై ఒక తుఫాను,” మోర్మన్ గ్రంథ కథలు

1 నీఫై 18

సముద్రముపై ఒక తుఫాను

ప్రభువునందు శాంతిని కనుగొనుట

ఓడలోనికి ఆహారమును తెస్తున్న కుటుంబాలు

ఓడలోనికి వెళ్ళడానికి అది సమయమని లీహైతో ప్రభువు చెప్పారు. వారు ప్రయాణిస్తుండగా తినడానికి కుటుంబాలు చాలా ఆహారాన్ని మూటకట్టారు. తరువాత వారందరు ఓడ మీదకు వెళ్ళారు మరియు వాగ్దాన దేశము వైపు ప్రయాణించారు.

1 నీఫై 18:5–8

ఓడలో ఉండగా తాగుతున్న జనులు

అనేక రోజులు సముద్రముపై ఉన్న తరువాత, కొందరు అగౌరవంగా, మొరటుగా ఉండటం ప్రారంభించారు. ప్రభువు వారికి సహాయపడ్డారని వారు మరచిపోయారు.

1 నీఫై 18:9

తుఫాను రావడంతో ఓడలో ఉన్న లెముయెల్, నీఫై, మరియు లేమన్

వారు ప్రభువుకు కోపం తెప్పిస్తారని నీఫై ఆందోళన చెందాడు. ప్రభువు సహాయం లేకుండా, వారి ఓడ భద్రంగా ఉండదు. ఆపమని నీఫై తన అన్నలను అడిగాడు.

1 నీఫై 18:10

నీఫైను తాళ్లతో కడుతున్న లేమన్, లెముయెల్

లేమన్, లెముయెల్ నీఫైపై కోపగించారు. వారు నీఫైను కట్టి వేసారు మరియు అతనితో అసభ్యంగా ప్రవర్తించారు. వారు ప్రభువుకు విధేయులు కాలేదు, మరియు లియహోనా పనిచేయడం ఆపేసింది. త్వరలో పెద్ద తుఫాను వచ్చింది. తుఫానులో మూడు రోజుల తరువాత, తాము మునిగిపోతామని వారందరు భయపడ్డారు.

1 నీఫై 18:10–13

లేమన్, లెముయెల్‌‌ను బ్రతిమాలాడుతున్న స్త్రీ

నీఫై కట్లు విప్పమని నీఫై కుటుంబం లేమన్, లెముయెల్‌ను బ్రతిమలాడారు. కానీ లేమన్, లెముయెల్ ఇంకా ఎవరిని నీఫై కట్లు విప్పనివ్వలేదు. శరయ మరియు లీహై విచారంగా ఉన్నారు మరియు చాలా అనారోగ్యానికి గురయ్యారు. తుఫాను ఆగలేదు.

1 నీఫై 18:17–19

లియహోనాతో నీఫై

నాలుగవ దినమున, ఓడ మునిగిపోబోతుందని లేమన్, లెముయెల్‌కు తెలుసు. వారు పశ్చాత్తాపపడ్డారు మరియు నీఫై కట్లు విప్పారు. నీఫై ప్రార్థన చేసినప్పుడు, తుఫాను ఆగిపోయింది. లియహోనా మరలా పని చేసింది. ఓడను సరైన దిశలో నడిపించడానికి నీఫై దానిని ఉపయోగించాడు.

1 నీఫై 18:14–15,20–22

ఓడను విడిచిపెట్టిన కుటుంబాలు మరియు ప్రార్థిస్తున్న లీహై

అనేక రోజుల తరువాత, కుటుంబాలు వాగ్దాన దేశమునకు చేరుకున్నాయి.

1 నీఫై 18:23