Scripture Stories
రాజైన బెంజమిన్


“రాజైన బెంజమిన్,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

మోషైయ 1–5

రాజైన బెంజమిన్

జనులకు, దేవునికి సేవ చేయడం

చిత్రం
బంగారు పలకలపై వ్రాస్తున్న బెంజమిన్

జరహేమ్ల దేశాన్ని పరిపాలించిన రాజైన బెంజమిన్ దేవుని యొక్క ప్రవక్త తన జనులకు సేవ చేయడానికి, వారికి దేవుని గురించి బోధించడానికి అతడు కష్టపడి పనిచేసాడు. దేవుని యొక్క ఇతర ప్రవక్తల నుండి సహాయంతో, బెంజమిన్ జరహేమ్లను నివసించడానికి ఒక శాంతికరమైన, భద్రమైన ప్రదేశంగా చేసాడు.

మోర్మన్ వాక్యము 1:17–18; మోషయ 1:1–7.

చిత్రం
మోషైయతో మాట్లాడుతున్న బెంజమిన్

బెంజమిన్ వృద్ధుడవుతాడు. జనులను ఏకతాటిపైకి తీసుకురావాలని అతడు తన కొడుకు మోషైయను అడిగాడు. వారి క్రొత్త రాజు మోషైయ అని వారితో చెప్పాలని బెంజమిన్ కోరాడు.

మోషైయ 1:9–10

చిత్రం
గుడారములో కుటుంబము

దేశం నలుమూలాల నుండి చాలామంది వచ్చారు. వారు బెంజమిన్ మాటలు వినడానికి దేవాలయం దగ్గర తమ గుడారాలను వేసుకున్నారు.

మోషైయ 2:1, 5–6

చిత్రం
గోపురం దగ్గర జనులు

బెంజమిన్ ఒక గోపురం నుండి మాట్లాడాడు ఆవిధంగా అనేకమంది జనులు అతడిని వినగలరు. వారిని నడిపించడానికి దేవుడు తనకు సహాయపడ్డారని బెంజమిన్ చెప్పాడు. రాజుగా, అతడు దేవుని ఆజ్ఞలను పాటించమని వారికి బోధించాడు. అతడు వారి డబ్బును తీసుకోలేదు లేదా అతడికి వారిని సేవ చేయనివ్వలేదు. బదులుగా, అతడు తన జనులకు, దేవునికి సేవ చేయడానికి పని చేసాడు.

మోషైయ 2:7–6

చిత్రం
జనులు ఒకరినొకరు సహాయం చేసుకొనడం

వారు ఒకరినొకరికి సేవ చేసుకున్నప్పుడు, వారు దేవునికి కూడ సహాయపడుతున్నారని బెంజమిన్ జనులకు చెప్పాడు. తరువాత వారికి ఉన్నదంతా దేవుని నుండి వచ్చినదని అతడు వారికి చెప్పాడు. తిరిగి, వారు ఆయన ఆజ్ఞలకు విధేయులుగా ఉండాలని దేవుడు కోరాడు. వారు విధేయులైనప్పుడు, దేవుడు వారికి ఎక్కువ దీవెనలు ఇచ్చాడు.

మోషైయ 2:17–24, 41

చిత్రం
బెంజమిన్ తన పక్కనే ఉన్న మోషైయతో మాట్లాడుతున్నాడు

తాను ఇక వారి రాజుగా లేదా బోధకునిగా ఉండలేనని అతడు వారితో చెప్పాడు. అతని కుమారుడు వారు క్రొత్త రాజుగా ఉంటాడు.

మోషైయ 2:29–31

చిత్రం
యేసు క్రీస్తు ఒకరిని స్వస్థపరచుట

తరువాత ఒక దేవదూత తనను దర్శించిందని బెంజమిన్ తన జనులతో చెప్పాడు. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు భూమిమీదకు వస్తాడని దేవదూత చెప్పింది. ఆయన అద్భుతాలు చేస్తారు మరియు జనులను బాగు చేస్తారు. ఆయన బాధను అనుభవించి, జనులందరిని రక్షించడానికి చనిపోతారు. ఆయనయందు విశ్వాసము కలిగియుండి, పశ్చాత్తాపపడిన ప్రతిఒక్కరిని యేసు క్షమిస్తారని బెంజమిన్ బోధించాడు.

మోషైయ 3:1–12; 17–18

చిత్రం
సంతోషంగా ఉన్న జనులు

యేసు గురించి బెంజమిన్ వారికి బోధించిన దానిని జనులు నమ్మారు. వారు పశ్చాత్తాపపడాలని వారికి తెలుసు. జనులందరు ప్రార్థించారు, వారిని క్షమించమని ప్రభువును అడిగారు. వారు ప్రార్థించిన తరువాత, దేవుని ఆత్మ వారితో ఉన్నది. వారు సంతోషంగా భావించారు మరియు యేసునందు వారి విశ్వాసము వలన దేవుడు వారిని క్షమించాడని వారికి తెలుసు.

మోషైయ 4:1–3; 6–8

చిత్రం
బెంజమిన్ మరియు మోషైయతో జనులు

జనులు వేరుగా, లోపల క్రొత్తగా భావించారు, ఎందుకనగా వారు యేసునందు విశ్వాసము కలిగియున్నారు. ఇప్పుడు వారు అన్ని సమయాలలో మంచి విషయాలను చేయాలని కోరుకున్నారు. వారు తమ జీవితాంతం దేవుని ఆజ్ఞలు అనుసరించాలని ఒక వాగ్దానమును చేసారు. వారు యేసునందు నమ్మకముంచి ఈ వాగ్దానమును చేసారు కనుక, వారు యేసు యొక్క జనులుగా పిలవబడ్డారు.

మోషైయ 5:2–9, 15; 6:1–2

ముద్రించు