లేఖన కథలు
మోర్మన్ జలముల వద్ద ఆల్మా


“మోర్మన్ జలముల వద్ద ఆల్మా,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

మోషైయ 18; 23

మోర్మన్ జలముల వద్ద ఆల్మా

దేవుని ప్రజలుగా మారడం

ఆల్మా జలముల వైపు చూస్తున్నాడు

ఆల్మా నోవహు అనే రాజు వద్ద యాజకుడుగా ఉండేవాడు. ఆల్మా దేవుని ప్రవక్త అయిన అబినడైని నోవహు చంపకుండా కాపాడటానికి ప్రయత్నించాడు. కానీ నోవహుకు ఆల్మాపై కోపం వచ్చింది మరియు ఆల్మాను కూడా చంపాలనుకున్నాడు. ఆల్మా సురక్షితంగా ఉండటానికి నోవహు నుండి పారిపోయాడు. పగటిపూట, ఆల్మా మోర్మన్ జలముల వద్ద దాక్కున్నాడు.

మోషైయ 17:2–4; 18:4–5, 8

ఆల్మా మోకాళ్లపై నిలబడి జలముల వద్ద ప్రార్థించాడు

యేసు క్రీస్తు గురించి అబినడై బోధించిన దానిని ఆల్మా విశ్వసించాడు. అతడు తన పాపాలను, తప్పులను క్షమించమని దేవుడిని వేడుకున్నాడు.

మోషైయ 18:1–2

రాత్రిపూట నగరంలో ఆల్మా

ఆల్మా ప్రజలను రహస్యముగా కలుసుకుని, వారికి యేసు గురించి బోధించాడు. వినే ప్రతి ఒక్కరికీ అతడు బోధించాడు.

మోషైయ 18:1–3

ప్రజలు జలముల వద్ద అల్మా బోధించే మాటలు విన్నారు

చాలా మంది అల్మాను విశ్వసించారు. ఆల్మా బోధనలు వినడానికి వారు మోర్మన్ జలముల వద్దకు వెళ్లారు.

మోషైయ 18:3–8, 31

ఆల్మా జలముల వద్ద కూర్చుని బోధించేవాడు

విశ్వాసులు దేవుని యొక్క ప్రజలుగా పిలువబడాలని, అవసరతలో ఉన్న ఇతరులకు సహాయం చేయాలని, మరియు దేవుని గురించి ప్రజలకు చెప్పాలని కోరుకున్నారు. కాబట్టి ఆల్మా వారిని బాప్తిస్మము తీసుకోమని ఆహ్వానించాడు. బాప్తిస్మము తీసుకోవడం ద్వారా, వారు దేవునికి సేవ చేయడానికి, మరియు ఆయన ఆజ్ఞలను పాటించడానికి దేవునితో ఒక నిబంధన లేదా వాగ్దానం చేస్తారు. బదులుగా, దేవుడు తన ఆత్మతో వారిని ఆశీర్వదిస్తారు.

మోషైయ 18:8–10, 13

ఆల్మా స్త్రీకి నీటిలో బాప్తిస్మమిచ్చాడు

ప్రజలు చాలా సంతోషించారు. వారు తమ చేతులతో చప్పట్లు కొట్టారు మరియు బాప్తిస్మము పొందాలనుకుంటున్నారని చెప్పారు. ఆల్మా వారిలో ప్రతి ఒక్కరికీ మోర్మన్ జలములలో బాప్తిస్మమిచ్చాడు. వారందరూ దేవుని ఆత్మతో నింపబడ్డారు మరియు వారి పట్ల దేవుని ప్రేమను అనుభూతిచెందారు. వారు క్రీస్తు సంఘ సభ్యులయ్యారు.

మోషైయ 18:11–17, 30

రాజైన నోవహు కోపంగా ఉన్నాడు మరియు సూచిస్తున్నాడు

తన ప్రజలలో కొందరు తన దేశాన్ని విడిచి వెళ్లడం నోవహు చూశాడు. వారిని గమనించడానికి సేవకులను పంపాడు. ఆల్మా బోధనలు వినడానికి ప్రజలు మోర్మన్ దేశానికి వెళ్లడం సేవకులు చూశారు. నోవహు చాలా కోపగించుకున్నాడు. అతడు ఆల్మాను మరియు ఆల్మా బోధిస్తున్న ప్రజలను చంపడానికి తన సైన్యాన్ని పంపాడు.

మోషైయ 18:31–33

ఆల్మా మరియు అతని ప్రజలు ప్రయాణం చేస్తారు

సైన్యం గురించి దేవుడు ఆల్మాను హెచ్చరించారు. దేవుని సహాయంతో, ఆల్మా మరియు అతని ప్రజలు సురక్షితంగా దేశాన్ని విడిచిపెట్టారు. సైన్యం వారిని పట్టుకోలేకపోయింది. వారు అరణ్యంలో ఎనిమిది రోజులు నడిచి ఒక అందమైన దేశానికి వచ్చారు. వారు అక్కడ కొత్త గృహాలను నిర్మించారు. ఆల్మా ప్రజలకు బోధించాడు, మరియు వారు దేవునికి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.

మోషైయ 18:34–35; 23:1–20