Scripture Stories
యెరూషలేముకు తిరిగివెళ్ళుట


“యెరూషలేముకు తిరిగివెళ్ళుట,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

“యెరూషలేముకు తిరిగివెళ్ళుట,” మోర్మన్ గ్రంథ కథలు

1 నీఫై 3

యెరూషలేముకు తిరిగివెళ్ళుట

కంచు పలకల కోసం ప్రయాణం

చిత్రం
కుటుంబం గుడారమును ఏర్పరుచుట

లీహై మరియు శరయ కుటుంబం అరణ్యములో ప్రయాణించుట. కంచు పలకలపై వ్రాయబడిన లేఖనాల గురించి కలలో, ప్రభువు లీహైతో చెప్పారు. యెరూషలేములో లేబన్ అనే పేరుగల వ్యక్తి వాటిని కలిగియున్నాడు. లీహై కుటుంబం వారి ప్రయాణములో వారితో కంచు పలకలను తీసుకొని వెళ్ళాలని ప్రభువు చెప్పారు.

1 నీఫై 3:1–3, 19–20

చిత్రం
కుటుంబముతో మాట్లాడుచున్న లీహై

కంచు పలకలను తీసుకొనిరావడానికి లీహైను తన కుమారులను యెరూషలేముకు పంపమని ప్రభువు చెప్పారు. నీఫై అన్నలు ఫిర్యాదు చేసారు. అది చేయడానికి కష్టమైన విషయమని వారు లీహైతో చెప్పారు. వారు వెళ్లడానికి ఇష్టపడలేదు.

1 నీఫై 3:4–5

చిత్రం
శరయ, లీహై, మరియు నీఫై మాట్లాడుతున్నారు

అది చేయడానికి చాలా కష్టమైనది, కానీ నీఫై లోబడాలని కోరాడు. ప్రభువు అతడికి, అతని అన్నలకు సహాయపడతారని అతడికి తెలుసు. యెరూషలేముకు తిరిగి వెళ్ళి కంచు పలకలు తీసుకొనిరమ్మని నీఫై లీహైతో చెప్పాడు.

1 నీఫై 3:6–8

చిత్రం
యెరూషలేము దగ్గర సోదరులు

లేమన్, లెముయెల్, శామ్, మరియు నీఫై యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. వారు అక్కడికి వెళ్ళినప్పుడు, లేమన్ లేబన్ ఇంటికి వెళ్లి కంచు పలకలను అడగాలని వారు నిర్ణయించారు.

1 నీఫై 3:9–11

చిత్రం
లేబన్ మరియు లేమన్

కంచు పలకల కోసం లేమన్ అడిగినప్పుడు, లేబన్ అతడిని దొంగని అని పిలిచాడు. లేమన్‌‌‌‌‌‌‌ను చంపుతానని లేబన్ అన్నాడు.

1 నీఫై 3:11–13

చిత్రం
కావలివారి నుండి పరుగెత్తుతున్న లేమన్

లేమన్ పారిపోయి, జరిగిన దానిని తన సోదరులకు చెప్పాడు.

1 నీఫై 3:14

చిత్రం
అన్నలతో మాట్లాడుతున్న నీఫై

నలుగురు సోదరులు విచారంగా ఉన్నారు. లేమన్, లెముయెల్, మరియు శామ్ అరణ్యములో వారి తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్ళాలని కోరారు, కానీ నీఫైకు ఒక ఆలోచన కలిగింది. కంచు పలకను పొందడానికి లేబన్‌తో వ్యాపారం చేయవచ్చని అతడు వారితో చెప్పాడు. పట్టణంలో వారి ఇంటికి వారు తిరిగి వెళ్ళారు మరియు వారి వద్ద ఉన్న బంగారం, వెండిని వ్యాపారం చేయడానికి తెచ్చారు.

1 నీఫై 3:14–16; 22–24

చిత్రం
కావలివారి నుండి పరుగెత్తుతున్న సోదరులు

వారు బంగారం, వెండిని లేబన్‌కు చూపించినప్పుడు, అతడు వాటన్నిటిని కావాలనుకున్నాడు. కానీ అతడు ఇంకా వారికి కంచు పలకలను ఇవ్వలేదు. బదులుగా, అతడు ఆ సోదరులను చంపమని తన సేవకులను పంపాడు, ఆవిధంగా అతడు వారి బంగారం, వెండిని తీసుకోవచ్చు.

1 నీఫై 3:16, 23–25

చిత్రం
కావలి వారినుండి దాక్కున్న సోదరులు

నలుగులు సోదరులు వారి ప్రాణాల కోసం పరుగెత్తారు మరియు వారి బంగారం, వెండిని విడిచిపెట్టారు లేబన్ సేవకులు వారిని పట్టుకోలేకపోయారు. సోదరులు ఒక గుహలో దాక్కున్నారు.

1 నీఫై 3:26–27

చిత్రం
లేమన్, లెముయెల్ నీఫై, శామ్‌పై కోపగించారు.

ఈ కష్టమైన విషయాలు జరిగాక, లేమన్, లెముయెల్‌లు నీఫైపై కోపగించారు. వాళ్లు నీఫైను, శామ్‌ను కర్రతో కొట్టారు.

1 నీఫై 3:28

చిత్రం
లేమన్ మరియు లెముయెల్‌తో మాట్లాడుతున్న దేవదూత

హఠాత్తుగా, ఒక దేవదూత వచ్చి, వారు నీఫైను ఎందుకు కొడుతున్నారని అడిగెను. వారిని నడిపించడానికి నీఫై ఎంపిక చేయబడ్డాడని దేవదూత అన్నది. అప్పుడు యెరూషలేముకు తిరిగి వెళ్ళమని దేవదూత వారితో చెప్పింది. కంచు పలకలు పొందడానికి ప్రభువు వారి కోసం ఒక మార్గమును సిద్ధపరుస్తారు.

1 నీఫై 3:29.

ముద్రించు