“నీఫైయుల సేవకురాలు,” మోర్మన్ గ్రంథ కథలు (2023)
నీఫైయుల సేవకురాలు
ఆమె తన ప్రజలను రక్షించడంలో సహాయం చేస్తుంది
మోరియాంటన్ అనే నీఫైయుల నాయకుడి వద్ద ఒక సేవకురాలు పనిచేసేది. మోరియాంటన్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. అతడు నీఫైయుల సమూహంపై దాడి చేసి వారి భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు అతను తన ప్రజలతో ఉత్తరాన ప్రయాణించి అక్కడ భూమిని తీసుకోవాలని అనుకున్నాడు.
ఒకరోజు, మోరియాంటన్ సేవకురాలిపై కోపం తెచ్చుకున్నాడు. అతడు ఆమె పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు మరియు ఆమెను గాయపరిచాడు. సేవకురాలు తప్పించుకుని సేనాధిపతి అయిన మొరోనై శిబిరానికి పరిగెత్తింది. మోరియాంటన్ చేసిన చెడ్డ పనుల గురించి ఆమె మొరోనైకి చెప్పింది. మొరోనై ఆమెను నమ్మాడు.
మోరియాంటన్ వెళ్లిపోవాలని, మరియు ఉత్తరాన ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవాలనుకుటున్నాడని కూడ సేవకురాలు చెప్పింది. మొరోనై ఆందోళన చెందాడు. మోరియాంటన్ ఉత్తరాన ఉన్న భూమిని స్వాధీనం చేసుకుంటే నీఫైయులు ప్రమాదంలో పడవచ్చు. దాని వలన ప్రజలు స్వేచ్ఛను కోల్పోయే అవకాశం ఉంది.
మోరియాంటన్‌ని ఆపడానికి మొరోనై సైన్యాన్ని పంపాడు. మోరియాంటన్ యొక్క ప్రజలు సైన్యంతో పోరాడారు మరియు ఓడిపోయారు. శాంతియుతంగా ఉంటామని వాగ్దానం చేసి తిరిగి తమ దేశానికి చేరుకున్నారు. సేవకురాలు మొరోనైని హెచ్చరించినందు వలన, నీఫైయుల నగరాలు సురక్షితంగా ఉన్నాయి.