Scripture Stories
ఆల్మా, అమ్యులెక్, మరియు జీజ్రోమ్


“ఆల్మా, అమ్యులెక్, మరియు జీజ్రోమ్,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

ఆల్మా 4–12

ఆల్మా, అమ్యులెక్, మరియు జీజ్రోమ్

దేవునియందు విశ్వసించుటకు మరియు దేవునికి విధేయత చూపుటకు కోరుకొనుట

చిత్రం
జనుల చేత ముట్టడి చేయబడిన ఆల్మా

అనేకమంది సంఘ సభ్యులు దేవుని ఆజ్ఞలకు విధేయులుగా లేరని ఆల్మా చూసాడు. అందువలన ఆల్మా దేవుని వాక్యమును బోధిస్తూ పట్టణం నుండి పట్టణానికి వెళ్ళాడు. అనేకమంది పశ్చాత్తాపపడ్డారు. తరవాత అమ్మోనైహా అని పిలవబడిన పట్టణానికి ఆల్మా వచ్చాడు. అక్కడి జనులు అతడి మాటలు వినలేదు. వారు అతడిని ఉమ్మి వేసారు మరియు పట్టణము నుండి బయటకు పంపేసారు.

ఆల్మా 4:11–20; 5–7; 8:1--13

చిత్రం
ఆల్మాతో మాట్లాడుతున్న దేవదూత

అతడు పట్టణము విడిచి వెళుతున్నప్పుడు ఆల్మా విచారంగా భావించాడు. అతడు జనుల కోసం ఆందోళన చెందాడు. అప్పుడు ఒక దేవదూత అతని వద్దకు వచ్చెను. అతడు దేవునికి విధేయుడిగా ఉన్నాడు కనుక ఆల్మా సంతోషంగా ఉండవచ్చని దేవదూత చెప్పింది. పట్టణానికి తిరిగి వెళ్లి, జనులను హెచ్చరించమని దేవదూత ఆల్మాతో చెప్పింది. వారు పశ్చాత్తాపపడక పోతే, వారు నాశనం చేయబడతారు. ఆల్మా వెంటనే తిరిగి వెళ్ళాడు.

ఆల్మా 8:14–18

చిత్రం
అమ్యులెక్‌తో మాట్లాడుతున్న ఆల్మా

ఆల్మా పట్టణంలోనికి వచ్చినప్పుడు, అతడు చాలా ఆకలిగా ఉన్నాడు. అతడు అనేక రోజులు ఉపవాసమున్నాడు. ఆల్మా అమ్యులెక్ అనే పేరుగల వ్యక్తిని ఆహారమివ్వమని అడిగాడు.

ఆల్మా 8:19, 26

చిత్రం
ఆల్మాను లోపలికి ఆహ్వానిస్తున్న అమ్యులెక్

తనకు కలిగిన కలను గురించి అమ్యులెక్ ఆల్మాతో చెప్పాడు. కలలో, ఒక దేవదూత ఆల్మా దేవుని ప్రవక్త అని అమ్యులెక్‌తో చెప్పింది. ఆల్మాకు సహాయపడాలని అమ్యులెక్ కోరాడు.

ఆల్మా 8:20

చిత్రం
అమ్యులెక్ కుటుంబాన్ని పలుకరిస్తున్న ఆల్మా

అమ్యులెక్ ఆల్మాను ఇంటికి తీసుకొనివెళ్ళి, తినడానికి అతనికి ఆహారమిచ్చాడు. అనేక రోజులు అమ్యులెక్ ఇంటివద్ద ఆల్మా బస చేసాడు. అమ్యులెక్, అతని కుటుంబాన్ని దేవుడు దీవించాడు. తరువాత, పశ్చాత్తాపపడమని పట్టణంలోని జనులకు చెప్పమని ఆల్మా మరియు అమ్యులెక్‌తో దేవుడు చెప్పాడు. ఆల్మా మరియు అమ్యులెక్ విధేయులైరి. వారికి బోధించుటకు సహాయపడటానికి దేవుడు వారికి తన శక్తినిచ్చెను.

ఆల్మా 8:21–32; 9–13

చిత్రం
జీజ్రోమ్ డబ్బును ఇవ్వజూపుట

వారు బోధించడం విన్న వారిలో ఒకరి పేరు జీజ్రోమ్. అతడు చాలా తెలివైనవాడు, ఆల్మా మరియు అమ్యులెక్‌ను మోసగించాలనుకున్నాడు. దేవుడు నిజము కాదని అతడు చెప్తే అమ్యులెక్‌కు చాలా డబ్బు ఇస్తానని అతనికి జీజ్రోమ్ చెప్పాడు. అతడు అమ్యులెక్ అబద్ధమాడాలని కోరాడు ఆవిధంగా జనులు అమ్యులెక్, ఆల్మా బోధించిన దానిని నమ్మరు.

ఆల్మా 10:29–32; 11:21–25; 12:4–6

చిత్రం
జీజ్రోమ్‌తో మాట్లాడుతున్న ఆల్మా మరియు అమ్యులెక్

కానీ అమ్యులెక్ దేవుని గురించి అబద్ధమాడడు. దేవుడు నిజమని అతడు చెప్పాడు. ఆల్మా, అమ్యులెక్‌కు జీజ్రోమ్ ఆలోచనలు తెలుసు. జీజ్రోమ్ ఆశ్చర్యపడ్డాడు మరియు వారిని అనేక ప్రశ్నలు అడిగాడు. దేవుడు తన పిల్లలందరి కొరకు ఒక ప్రణాళికను కలిగియున్నారని వారు జీజ్రోమ్‌కు బోధించారు. దేవుడు మరియు యేసు క్రీస్తు గురించి ఆల్మా, అమ్యులెక్ చెప్పిన దానిని జీజ్రోమ్ నమ్మాడు.

ఆల్మా 11:23–46; 12:1–18, 24–34; 14:6–7; 15:6–7

చిత్రం
ఆల్మా మరియు అమ్యులెక్‌తో నడుస్తున్న జీజ్రోమ్

తాను చేసిన చెడ్డ విషయాలను బట్టి జీజ్రోమ్ చాలా విచారించాడు. అతడు చాలా అనారోగ్యం చెందాడు. ఆల్మా మరియు అమ్యులెక్ అతడిని దర్శించారు. యేసునందు జీజ్రోమ్ విశ్వాసము వలన జీజ్రోమ్ బాగు చేయబడతాడని ఆల్మా చెప్పాడు. అతడిని బాగు చేయమని ఆల్మా దేవునిని అడిగాడు. జీజ్రోమ్ తన కాళ్లపైకి త్వరగా లేచాడు. అతడు బాగుచేయబడ్డాడు! అతడు బాప్తీస్మము పొందాడు, తన మిగిలిన జీవితకాలమంతా జనులకు బోధించాడు.

ఆల్మా 15:1–12; 31:6, 32

ముద్రించు