లేఖన కథలు
అరణ్యములో స్త్రీలు


“అరణ్యములో స్త్రీలు,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

1 నీఫై 16–17

అరణ్యములో స్త్రీలు

ప్రభువుతో నడుచుట

నడుస్తున్న స్త్రీలు

ఇష్మాయేలు కుమార్తెలు వారి కుటుంబంతోపాటు అరణ్యములో ప్రయాణించారు. వారి ప్రయాణము కష్టమైనది. కొంత కాలము తరువాత, వారు లీహై మరియు శరయ కొడుకులను పెళ్ళి చేసుకున్నారు.

1 నీఫై 16:7; 17:1

ఇష్మాయేలు సమాధి వద్ద విచారంగా ఉన్న కుమార్తెలు

ఒకరోజు, ఇష్మాయేలు చనిపోయాడు. అతడి కుమార్తెలు చాలా విచారించారు. వారి నాన్నను వారు గుర్తు చేసుకున్నారు. వారు, వారి కుటుంబాలు కూడ అరణ్యములో చనిపోతామని ఆ కుమార్తెలు ఆందోళన చెందారు. వారు లీహై, నీఫైలతో నిరాశ చెందారు, మరియు యెరూషలేముకు ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు.

1 నీఫై 16:34–36

ఒకరినొకరు ఓదార్చుకొంటున్న సహోదరీలు

ఇష్మాయేలు కుమార్తెలు మరియు వారి కుటుంబాలతో ప్రభువు యొక్క స్వరము మాట్లాడెను. వారు పశ్చాత్తాపపడ్డారు, మరియు ప్రభువు వారిని దీవించారు.

1 నీఫై 16:39

చిన్న పిల్లలతో శరయ

అరణ్యములో స్త్రీలకు పిల్లలు కలిగారు. శరయకు కూడ మరొక ఇద్దరు కొడుకులు కలిగారు, జేకబ్ మరియు యోసేపులు.

1 నీఫై 17:1; 18:7

ప్రయాణిస్తున్న కుటుంబాలు

వారి ప్రయాణంలో ప్రభువు స్త్రీలకు సహాయం చేసారు. ఆయన వారి పిల్లలకు సమృద్ధియైన పాలతో వారిని దీవించారు. వారు ప్రయాణించినప్పుడు బలంగా మారటానికి ఆయన స్త్రీలకు సహాయం చేసారు.

1 నీఫై 17:1--3

గుడారములో తల్లులు మరియు పిల్లలు

కుమార్తెలను మరియు వారి కుటుంబాలను ఒక వాగ్దాన దేశమునకు తాను నడిపిస్తున్నానని ప్రభువు చెప్పారు. వారు ప్రయాణించినప్పుడు వారికి అవసరమైనదంతా కలిగియుంటారని ప్రభువు కుటుంబాలకు వాగ్దానమిచ్చారు. ఆయన వారు వేటాడిన ఆహారాన్ని తినడానికి మంచిగా చేసారు, మరియు ఆయన వారిని నడిపించారు.

1 నీఫై 17:3, 5, 12–14

సముద్రతీరము వద్ద కుటుంబాలు

అరణ్యములో ఎనిమిది సంవత్సరాలు ఉన్న తరువాత, కుటుంబాలు సముద్రాన్ని చేరుకున్నాయి. వారి కుటుంబాలతో స్త్రీలు ఆనందించారు. సముద్రము వద్ద ప్రదేశము అందమైనది. వారు దానిని సమృద్ధి అని పిలిచారు, ఎందుకనగా అది తినడానికి పండ్లు, తేనెతో నిండి ఉన్నది. ప్రభువు వాటన్నిటిని వారి కోసం సిద్ధపరిచారు.

1 నీఫై 17:4–6