15వ ప్రకరణము
1829 జూన్, న్యూయార్క్‌లోని ఫేయెట్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా జాన్ విట్మర్కివ్వబడిన బయల్పాటు (14వ ప్రకరణ శీర్షిక చూడుము). ఈ సందేశము ఎంత సన్నిహితమైనది, ప్రత్యేకముగా వ్యక్తిగతమైనదంటే, అది జాన్ విట్మర్ మరియు ఆయనకు మాత్రమే తెలియునని ప్రభువు చెప్పును. తరువాత జాన్ విట్మర్ ఎనిమిదిమంది సాక్షులలో ఒకరిగా మారెను.
1–2, ప్రభువు బాహువు భూమియంతటిపై యున్నది; 3–6, సువార్తను ప్రకటించుట, ఆత్మలను రక్షించుట అనునది అత్యంత విలువైనది.
1 నా సేవకుడైన జాన్ ఆలకించుము, నీ రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు మాటలను వినుము.
2 ఏలయనగా ఇదిగో, నేను నీతో కాఠిన్యముతోను అధికారముతోను మాట్లాడుచున్నాను, ఏలయనగా నా బాహువు భూమియంతటిపై యున్నది.
3 నీవు, నేను తప్ప మరెవరు ఎరుగని దానిని నేను నీకు చెప్పెదను—
4 నీకు ఏది అత్యంత విలువైనదో తెలుసుకోవాలని నీవు అనేకమార్లు నా నుండి కోరితివి.
5 ఇదిగో, ఈ విషయము నిమిత్తము నా ఆజ్ఞలను బట్టి, నేను నీకిచ్చిన నా మాటలను పలికినందుకు నీవు ధన్యుడవు.
6 ఇదిగో, నీకు అత్యంత విలువైనదేమనగా నా యొద్దకు ఆత్మలను తెచ్చి, తద్వారా నా తండ్రి రాజ్యములో వారితోపాటు విశ్రాంతి పొందునట్లు ఈ జనులకు పశ్చాత్తాపమును ప్రకటించుటయని నేను నీకు చెప్పుచున్నాను. ఆమేన్.